విశాఖపట్నం

18 ఏళ్ళు నిండిన ప్రతి విద్యార్ధిని ఓటరు నమోదు చేయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 22: అన్ని కళాశాలలు, యూనివర్సిటీల్లో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క విద్యార్ధిని ఓటరు నమోదు చేయించాల్సిందిగా జాయింట్ కలెక్టర్ జీ.సృజన తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో గల వైద్య,ఆరోగ్య,మహిళా శిశుసంక్షేమం, నెహ్రు యువకేంద్రం, విద్యాసంస్థల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలననుసరించి ఈ ఏడాది జనవరి నాటికి 18 ఏళ్ళు నండిన వారిని ఎలక్టోరల్ రోల్‌లో పేర్ల నమోదును చేయించాలన్నారు. ప్రత్యేక సమ్మరి రివిజన్‌లో భాగంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో గల కళాశాలలో విద్యార్థులను ఓటుహక్కు గురించి అవగాహన కలిగించడంతోపాటు వారు ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకునే విధంగా మోటివేట్ చేయాలన్నారు. ఆన్‌లైన్ విదానంలో ఫారం ఆరును నింపి వారి ఓటును నమోదు చేసుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. సమ్మరి రివిజన్ ఇన్ ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా బిఎల్‌ఓలు ఇంటింటికి సర్వే చేయడానికి వస్తారని ఓటును నమోదు చేసుకున్న ఓటర్ల వివరాలను పరిశీలిస్తారని ఏమైన తప్పుఓప్పులుంటే సరిదిద్దే అవకాశం కలుగుతుందన్నారు. అన్ని విద్యాసంస్థల్లో వచ్చేనెల ఒకటవ తేదీ నుండి 31వ తేదీ మధ్యలో ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి ఓటర్ల నమోదు శాతాన్ని పెంచాలన్నారు. ప్రతి శిబిరానికి నోడల్ అధికారిని నియమించాలన్నారు. మహిళా శిశు సంక్షేమం, వైద్య,ఆరోగ్యం, డిఆర్‌డిఏ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు, ఎస్‌హెచ్‌జి సభ్యులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి అధిక మొత్తంలో ఓటర్ల నమోదును చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నెహ్రు యువకేంద్రాలు, యూత్ లీడర్లు, స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. ఎంప్లారుూమెంట్, ట్రాన్స్‌పోర్టు శాఖాధికారులు వారి వద్దకు వచ్చే యువతకు ఓటరు గుర్తింపు కార్డు ఉండే విధంగా తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరెడ్డి, ఏయూ రిజిస్ట్రార్ వెలగపూడి ఉమామహేశ్వరరావు, డీటీసి వెంకటేశ్వరరావు, మహిళా శిశు సంక్షేమశాఖ పీడి చిన్మయిదేవి, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి వెంకటరత్నం, విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.