విశాఖ

ప్రత్యేక సహాయ కేంద్రాలను వినియోగించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, జూన్ 23: కొత్తవలస-కిరండోలు రైలు మార్గంలోని ప్రత్యేక భద్రత సహాయక కేంద్రాలను వినియోగించుకోవాలని తూర్పు కోస్తా రైల్వే విశాఖ డివిజన్ సీనియర్ సెక్యూరిటీ కమిషనర్ జితేంద్ర శ్రీవత్సవ్ కోరారు. పర్యాటకుల సౌకర్యార్థం అరకులోయ రైల్వే స్టేషన్‌లో రైల్వే ప్రోటక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రత్యేక భద్రత సహాయక కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ దేశ, విదేశీ పర్యాటకుల సౌకర్యార్థం కె.కె.లైన్‌లోని అరకులోయ, బొర్రా గుహాల రైల్వే స్టేషన్లలో ఈ సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసామని చెప్పారు. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక భద్రత సహాయక కేంద్రాలు సత్పలితాలు ఇస్తే మరికొన్ని రైల్వే స్టేషన్లలో వీటిని ప్రారంభిస్తామని ఆయన అన్నారు. కె.కె. రైలు మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు వీటిని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. అరకులోయ అందాలు, ప్రకృతి సిద్ధంగా వెలసిన బొర్రా గుహాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటకులు పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు గుర్తించి వారి సౌకర్యార్థం సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసామని ఆయన అన్నారు. రైలు ప్రయాణికులు ప్రయాణించే సమయంలో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు టోల్‌ప్రీ నెంబరు 182కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే వారికి ఇబ్బందులు లేకుండా రైల్వే ప్రోటక్షన్ ఫోర్స్ తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. అరకులోయను సందర్శించే పర్యాటకులకు అవసరమైన సమాచారాన్ని కూడా ఈ కేంద్రాలు అందిస్తాయని ఆయన అన్నారు. పర్యాటకులు విడిది చేసే అతిధి గృహాలు, వాహనాల సదుపాయాల కోసం ఈ కేంద్రం సహాయం చేస్తుందని ఆయన చెప్పారు. బొర్రా గుహాలు, అరకులోయ రైల్వే స్టేషన్లలో సరిపడే రైల్వే ప్రోటక్షన్ ఫోర్స్ ఉన్నట్టు ఆయన తెలిపారు. రైలు ప్రయాణికులకు చైతన్యపరిచే కార్యక్రమాలను కూడా చేపట్టినట్టు జితేంద్ర శ్రీవత్సవ్ చెప్పారు. అనంతరం స్థానిక రైల్వే స్టేషన్‌లో విశాఖపట్నం సాయి హెల్పింగ్ హేండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించి రైలు ప్రయాణికులకు వైద్య సేవలు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ శిబిరంలో సుమారు 120 మంది రైలు ప్రయాణికులతో పాటు స్థానికులు వైద్య సేవలు పొందారు. ఈ కార్యక్రమంలో రైల్వే ప్రోటక్షన్ ఫోర్స్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్. వెంకట రామక్రిష్ణారావు, రైల్వే ఎస్.ఐ. బి.సూర్యనారాయణరావు, అరకులోయ సి.ఐ. వెంకునాయుడు, డుంబ్రిగుడ ఎస్.ఐ. అమ్మనరావు, రైల్వే సిబ్బంది, మోటార్ యూనియన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఘాట్‌లో రెండు బస్సులు డీ
అరకులోయ, జూన్ 23: అరకులోయ ఘాట్ రోడ్డులో ఆర్.టి.సి. బస్సులు శనివారం డీ కొన్నాయి. శృంగవరపుకోట ఆర్.టి.సి. డిపోకు చెందిన బస్సులు గాలికొండ సమీపాన మలుపురోడ్డు వద్ద ప్రమాదవశాత్తు డీ కొనడంతో ప్రయాణికులు స్వల్ప గాయాలకు గురయ్యారు. విశాఖపట్న నుంచి అరకులోయకు వస్తున్న బస్సు, అరకులోయ నుంచి శృంగవరపుకోటకు వెళుతున్న మరో బస్సు ఈ మలుపు వద్ద డీ కొన్న సంఘటనలో అరకులోయ నుంచి వెళుతున్న బస్సులో ఉన్న ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. రెండు ఆర్.టి.సి. బస్సుల డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే గాలికొండ లోయలోకి బస్సులు పడేదని చెబుతున్నారు. ఈ సంఘటనతో ఆర్.టి.సి. బస్సులు ఇరువైపులా రహదారికి అడ్డంగా నిలిచిపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. రెండు వైపులా వాహనాలు బారులు తీరి నిలిచిపోవడంతో దాదాపు నాలుగు గంటల పాటు ట్రాఫిక్ స్థంబించిపోయింది. దీంతో ప్రయణికులు ఇబ్బందులకు లోనయ్యారు.