విశాఖపట్నం

రైల్వే జోన్ కోసం టీడీపీ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 23: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ సాధనకు టీడీపీ ఆందోళనకు ఉపక్రమించనుంది. ఇప్పటి వరకూ విపక్ష వైసీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సహా పలు ప్రజాసంఘాలకే పరిమితమైన రైల్వేజోన్ ఉద్యమాన్ని అధికార టీడీపీ కూడా అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. నాలుగేళ్ల కింద కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ, టీడీపీ నాలుగేళ్ల పాటు మిత్రులుగా కొనసాగారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రైల్వేజోన్ ఇచ్చి తీరాలని విపక్షాలు చేసిన ఉద్యమాలు అణచివేసిన టీడీపీ ఇప్పుడు బీజేపీతో సత్సంబంధాలు తెగిపోవడంతో తాను కూడా జోన్ ఉద్యమాన్ని చేపట్టాలని భావిస్తోంది. ఇప్పటికే రైల్వేజోన్ సాధనకు మంత్రి గంటా శ్రీనివాసరావు నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేయగా, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు ఏకంగా రెండు సార్లు దీక్షలు చేశారు. తాజాగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప నేతృత్వంలో శనివారం జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో రైల్వేజోన్ అంశంపై చర్చించారు. జోన్ విషయంలో పోరాడే అంశంలో టీడీపీ ఇప్పటికే వెనుకబడిందని గుర్తించిన పార్టీ నేతలు ఎలాగైనా జోన్ ఉద్యమానిక తామే కీలకంగా ప్రజలకు చూపించాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగానే వచ్చే నెల 4న విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుపై ప్రజాప్రతినిధులంతా నిరాహార దీక్ష చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం జోన్ ఉద్యమాన్ని ఉధృతం చేయడం ద్వారా ప్రజల్లో తాము కూడా పోరాడుతున్నామన్న అభిప్రాయాన్ని నెలకొల్పాలని భావిస్తున్నారు. పదవీ కాలం ముగిసే లోగా రైల్వేజోన్ తెచ్చి తీరుతామని బీజేపీ ఎంపీ హరిబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి విధితమే. నిజంగా బీజేపీ జోన్ ఇస్తే అది తాము చేసిన ఉద్యమ ఫలితంగానే వచ్చిందని ప్రచారం చేసుకునేలా టీడీపీ వ్యూహాత్మకంగా జోన్‌పై ఉద్యమానికి శ్రీకారం చుడుతోందని పరిశీలకులు భావిస్తున్నారు.