విశాఖపట్నం

అధికారుల నిర్లక్ష్యం... వికలాంగులకు శాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, జూన్ 24: అధికారుల నిర్లక్ష్యం వికలాంగులకు శాపంగా మారింది. వివిధ రకాల వికలాంగులకు వారి సమస్యలను చూసి మంజూరు చేయాల్సిన ధ్రువీకరణ పత్రాల మంజూరులో జ్యాపం జరుగుతోంది. వాస్తవానికి జిల్లాలో అన్ని మండలాలకు సంబంధించి వివిధ కేటాగిరీల్లో ఉన్న వికలాంగులకు వారి వయస్సు, వికలాంగ శాతాన్ని వైద్యుల సమక్షంలో పరీక్షలు నిర్వహించి అర్హులైన వారందరీకీ సదరం ద్వారా ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తారు. ఈ ధ్రువీకరణ పత్రం ఆధారంగానే ఏ పథకం అమలుకైనా వీరంతా అర్హులుగా భావించి వారికి ఆయా పథకాలు అమలు చేస్తుంటారు. ప్రతి ఏటా కొత్తవాటితో పాటు, పాత వాటికి రెన్యువల్ చేస్తుంటారు. అయితే ఈ మంజూరు చేయాడానికి ఆన్‌లైన్ ప్రక్రియ కావడంతో ఆయా వెబ్‌సైట్ గత ఆరు నెలలుగా పని చేయకవపోవడంతో వికలాంగులంతా నానా అవస్థలు పడుతున్నారు. ప్రతీ సోమవారం కేజీహెచ్ జనరల్ మెడిసిన్ విభాగంలో వికలాంగులకు సంబంధించి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటారు. ఈ శిబిరానికి వారానికి ఐదు వందల నుంచి ఆరు వందల మంది వివిధ కేటగిరీల్లో వస్తుంటారు. వీటికి సంబంధించి వెబ్‌సైట్ నిర్వహాణంతా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డి ఆర్‌డి ఎ ) ఆధ్వర్యంలో అధికారులు పర్యవేక్షిస్తుంటారు. అమరావతిలో ఏపీ టెక్నాలజీకల్ సంస్థలోని ఏర్పడ్డ సాంకేతిక కారణాలను సాకుగా చూపి వైబ్‌సైట్ ఆరు నెలలు నుంచి పూర్తిగా పని చేయకపోవడంతో వికలాంగుల సమస్య తీవ్రతరమైంది. ఈ విషయంపై సరైన సమాచారం లేని ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన వికలాంగులు నానా అవస్థలు పడుతూ ప్రతీ సోమవారం కేజీహెచ్‌కు తరలివస్తున్నా అధికారులు మాత్రం ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపకపోవడంతో ఏమి చేయాలో తెలియక వారంతా ఆందోళన చెందుతున్నారు. గడిచిన ఆరు నెలల్లో సుమారు రెండు వేల మంది వికలాంగులు ఈ సదరం సర్ట్ఫీకేట్లు కోసం పలు మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. కేజీహెచ్‌లో డీ ఆర్‌డి ఎ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో కనీసం సూదర ప్రాంతాల నుంచి వచ్చిన వికలాంగులకు ఏం జరుగుతుందో అనే వివరాలు తెలిపే వారు కూడా లేకుండా ఉండటంతో వారంతా దిక్కుతోచని పరిస్థితుల్లో వెనతిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీరిలో అధిక సంఖ్యలో బాలలే ఉన్నారని అయినా నేటికి డి ఆర్‌డి ఏ అధికారులు ఏమాత్రం పట్టించుకొవడం లేదున్నారు. ఈ విషయంపై చైల్డ్‌రైట్స్ ప్రోటెక్షన్ ఫోరం నగర అధ్యక్షుడు జీ.సీతారాం మాట్లాడుతూ తక్షణమే వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్పందించి వారికి డి ఆర్ డి ఎ అధికారులతో మాట్లాడి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే డి ఆర్ డి ఎ జిల్లా అధికారి దృష్టికి తీసుకువెళ్లిన ఏమాత్రం పట్టించుకొవడం లేదున్నారు.