విశాఖపట్నం

అంతుచిక్కని గంటా అంతరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 24: తనపై తప్పుడు సర్వేలు చేయించి, తన ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు అలక పాన్పు ఎక్కడం, ముఖ్యమంత్రే స్వయంగా ఆయన అలక తీర్చడంతో ఇదంతా టీ కప్పులో తుపాను అని అంతా సరిపెట్టుకున్నారు. అయితే, ఆ తరువాత గంటా వ్యవహారశైలిని చూస్తే, ఆయన ఏదో వ్యూహంతో ముందుకు వెళుతున్నారన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. విశాఖలో శనివారం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చినరాజప్ప అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి అయ్యన్నపాటు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. కానీ గంటా ఈ సమావేశానికి రాలేదు. అదే సమయంలో ఆయన నగరంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం. కనీసం ఒకసారి సమావేశానికి వచ్చి, వెళ్లినా బాగుండేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ విషయమై గంటా శ్రీనివాసరావును వివరణ కోరగా, ఆరోజు 12 గంటల విమానానికి తను చెన్నైకి వెళ్లాల్సిన ఉంది. ఆరోజు తను పాల్గొనిన కార్యక్రమాలు ముందుగానే ఖరారయ్యాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాలకు హాజరు కావల్సి ఉన్నందునే డీఆర్‌సీక వెళ్లలేదని చెప్పారు. నెల్లూరు జిల్లా నాయకుడు ఆనం రామ్‌నారాయణరెడ్డిని మంత్రి గంటా కలవడం కూడా చర్చనీయాంశమైంది. రామ్‌నారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని విడిచి, వైసీపీకి వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. ఆయనను బుజ్జగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంటాను పంపించారా? లేక, ఆనంతో కలిసి నడిచేందుకు గంటా వెళ్లారా? అన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ విషయమై మంత్రి గంటా మాట్లాడుతూ ఆనం వివేకానందరెడ్డి మరణించిన తరువాత రామ్‌నారాయణరెడ్డిని పరామర్శించలేదు. అందువలన అక్కడికి వెళ్లాలని అన్నారు. అయితే, గంటా అలిగి ఇంట్లో ఉన్నప్పుడు చినరాజప్ప వచ్చి బుజ్జగించి, అంతా సమసిపోయిందని చెప్పినప్పుడు కూడా గంటా విలేఖరులతో మాట్లాడుతూ తాను ఇప్పుడు ఏమీ మాట్లాడను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని చెప్పడం రాజకీయ విశే్లషకులు పరిపరి విధాల ఆలోచించడానికి అవకాశం ఇచ్చినట్టయింది.