విశాఖపట్నం

ఆఫీసర్ ప్రాణాలను కాపాడిన కోస్ట్‌గార్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 16: రెండు రోజుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ విపత్కర పరిస్థితుల్లో ఉన్న ఒక నౌకలోని జూనియర్ ఆఫీసర్‌కు వెంటనే చికిత్సనందించి ప్రాణాలు కాపాడారు కోస్ట్‌గార్డ్ సిబ్బంది. దీనికి సంబంధించి కోస్ట్‌గార్డ్ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మన దేశానికి చెందిన చమురు రవాణా చేస్తున్న ఓ వాణిజ్య నౌకలో జూనియర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న 27 ఏళ్ల మృదుల్ సింగ్ గత రెండు రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. పొట్టకూడా బాగా ఉబ్బిపోవడంతో పరిస్థితి విషమంగా మారింది. వెంటనే వాణిజ్య నౌకలోని అధికారులు రోగికి వైద్య సహాయం అందించాల్సిందిగా కోస్ట్‌గార్డ్‌ను అభ్యర్థించారు. వెంటనే ఆ నౌకకు సమీపంలో ఉన్న మారీటైం రెస్క్యూ సబ్ సెంటర్ నౌకు అక్కడి పంపించారు. ఈ నౌక సోమవారం 12.30 గంటలకు వాణిజ్య నౌక వద్దకు చేరుకుంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ, రోగిని సురక్షితంగా తమ నౌకలోకి మార్చి, వైద్య సహాయం అందించారు. ఆ తరువాత మృదుల్ సింగ్‌ను వాణిజ్య నౌకలోని అధికారులకు అప్పగించారు.