విశాఖపట్నం

పెరగనున్న భూముల ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 16: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు పెరగనున్నాయి. ఈ ధరల పెంపు విశాఖ నగరంలోని నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపబోతోంది. అయితే, ధరల పెంపు నగరంలోని కొన్ని ప్రాంతాలకే వర్తిసుందని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు చెపుతున్నారు. రిజిస్ట్రేషన్లు తక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ధరల పెంచకుండా, ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరుగుతున్న ప్రదేశాల్లో భూముల ధరలు పెంచడం సరికాదంటున్నారు క్రిడాయ్ నేతలు. భూములు ధరలు పెంచినా, పెంచకపోయినా, నగరంలో సామాన్యులు సొంత ఇల్లు దక్కించుకోలేకపోతున్నారన్నది వాస్తవం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నగరంలోని ద్వారకానగర్, డాబాగార్డెన్స్, వీఐపీ రోడ్డు ఏరియా, రామ్‌నగర్ ప్రాంతాల్లో చదరపు గజం లక్షా పాతివేల రూపాయలు పలుకుతోంది. గాజువాకలో 25 నుంచి 30 వేలు, ఎన్‌ఏడీ కొత్తరోడ్డు, గోపాలపట్నం ప్రాంతాల్లో సుమారు 35 వేల రూపాయలు, పెందుర్తిలో చదరపు గజం 25 నుంచి 30 వేల రూపాయలు పలుకుతోంది. అలాగే, మధురవాడలో చదరపు గజం ధర 35 నుంచి 40 వేల రూపాయలు ఉంది. అయితే మధురవాడ, ఆనందపురం, పెందుర్తి, గోపాలపట్నం, గాజువాక తదితర ప్రాంతాలతోపాటు, విశాఖ గ్రామీణ ప్రాంతాల్లో పుస్తక విలువ తక్కువగా ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోకి వచ్చే భూముల ధరలు గరిష్ఠంగా ఐదు శాతం పెంచబోతున్నారు. నగర నడిబొడ్డునున్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు చాలా తక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ పుస్తక విలువతోపాటు, మార్కెట్ ధర కూడా గణనీయంగా ఉండడం వలన ఈ ప్రాంతాల్లో భూముల విలువ పెంచడం లేదని అధికారులు వెల్లడించారు. కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ధరలు పెంచినా ప్రజలపై పెద్ద భారం ఉండదని అధికారులు చెపుతున్నారు. భూ క్రయ, విక్రయాలు జరిగే చోట ధరలు పెంచడం, జరగని చోట ధరలు పెంచకపోవడాన్ని క్రిడాయ్ ప్రతినిధులు తప్పుపడుతున్నారు.
జీఎస్టీతోనే సతమతం!
జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత బిల్డర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 50 లక్షల రూపాయలు ఖరీదైన ఒక ఫ్లాట్ కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చే వ్యక్తి 12 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది. అంటే, కనీసం ఆరు లక్షల రూపాయలు జీఎస్టీ కింద చెల్లించాలి. రిజిస్ట్రేషన్ చార్జీల కింద 7.5 శాతం చెల్లించాలిస అంటే ఇదో నాలుగు లక్షల వరకూ అవుతుంది. రిజిస్ట్రేషన్ల సమయంలో అదనంగా మరో 10 నుంచి 15 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో సామాన్యులు ఇంత అదనపు మొత్తాన్ని చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేయడంల లేదు. దీంతో నగర పరిధిలో సుమారు 10 వేల వరకూ ఫ్లాట్లు అమ్ముడు కాకుండా ఉండిపోయినట్టు బిల్డర్లు చెపుతున్నారు. ఇప్పడు భూముల ధరలు కూడా పెంచితే, బిల్డరు పెరిగిన ఈ మొత్తాన్ని కూడా వినియోగదారునిపైనే వేయాల్సి వస్తుందని, దీనివలన ఫ్లాట్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెపుతున్నారు.
అనూహ్యంగా పెరిగిన ధరలు
రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా విశాఖలో ప్లాట్లు, ఫాట్ల ధరలు పెరిగిపోతున్నాయి. నగర నడిబొడ్డున ఉన్న ప్రాంతాలు, బీచ్ రోడ్డులోని ఆస్తులను కొనుగోలు చేయడానికి సామాన్యులు ముందుకు రావడం లేదు. ముంబై, చెన్నై, ఢిల్లీలో తమకున్న ఆస్తులను విక్రయించుకుని వచ్చిన మొత్తంలో కొంత వెచ్చించి, పైన చెప్పిన ప్రదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారే తప్ప, స్థానికులెవ్వరూ ఈ ప్రాంతంవైపు కనె్నత్తి కూడా చూడడం లేదని బిల్డర్లు చెపుతున్నారు. ఇక గోపాపట్నం, పెందుర్తి, ఆనందపురం, మధురవాడ ప్రాంతాల్లో స్థలాల కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. అందరూ అపార్ట్‌మెంట్ల వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో బిల్డర్లు కూడా ధరలు పెంచేస్తున్నారు.
వెనకాడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు
ఇదిలా ఉండగా భారీ మొత్తాన్ని వెచ్చించి ఫ్లాట్లు, ప్లాట్లు కొనుగోలు చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులు ముందుకు రావడం లేదని రిజిస్ట్రేషన్ అధికారులే చెపుతున్నారు. వారు వెచ్చించే మొత్తానికి లెక్కలు చెప్పాలి. అంతేకాకుండా ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీబీ అధికారులు కూడా కనే్నసి ఉంచడంతో వారు ఆస్తుల కొనుగోళ్లపై ఆసక్తి చూపడం లేదని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వెల్లడించారు.
భూముల అమ్మకాలు, కొనుగోళ్లు అధికంగా జరిగే ప్రాంతాల్లో భూముల ధరలు తగ్గించి, రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరగని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ధరలు పెంచితే, వ్యాపార లావాదేవీలు ఎక్కువగా జరుగుతాని క్రిడాయ్ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.