విశాఖ

పట్టణంలో తాగునీటి సౌకర్యానికి ప్రత్యేక ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, జూలై 17: పట్టణవాసుల సౌకర్యార్థం ఇంటింటి కుళాయి సదుపాయంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు తెలిపారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని బుక్కావీధి, బోళ్లవీధుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పర్యటించారు. ఇంటింటికి వెళ్లి అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే సిఎం చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గూర్చి వివరించారు. ఈ సందర్భంగా అక్కడి ఫ్రజలు ఇంటింటికి కుళాయిల విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి సదుపాయానికి ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఇంటింటికి కుళాయిల ఏర్పాట్లపై ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో ఇంటింటి కుళాయి సదుపాయాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. అలాగే ఇతర వౌలిక వసతుల విషయంపై కూడా ఆయన ఆరాతీసారు. అవసరమైన సమస్యల పరిష్కారానికి ఎక్కడికక్కడే ఆన్‌లైన్‌లో ఆయా సమస్యలను పొందుపరచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట గోవాడ సుగర్స్ మాజీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, ఎంపీపీ గూనూరు కొండతల్లి, జెడ్పీటిసి కనిశెట్టి మత్స్యరాజు, ఎంపీటీసీ సభ్యులు మారేడుపూడి రమాదేవి, సర్పంచ్ దొమ్మెసి అప్పలనర్స గిరి, పార్టీ మండల శాఖ అధ్యక్షులు బొడ్డేడ నాగగంగాదర్, వార్డుమెంబర్లు, రమాకుమారి, శ్రీను, ముడుసు గోవింద తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయండి
చోడవరం, జూలై 17: జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం బుధవారం నర్సీపట్నంలో నిర్వహించనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూనూరు వెంకట్రావుతెలిపారు. మంగళవారం స్థానిక దుర్గాకల్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఉదయం 11గంటలకు నిర్వహించతలపెట్టిన ఈ సమావేశానికి డిసిసి అధ్యక్షులు పి. బాలరాజు అధ్యక్షత వహిస్తారని, ఎఐసిసి ఫ్రధాన కార్యదర్శి, కేరళ మాజీముఖ్యమంత్రి ఉమెన్‌చాందీ హాజరవుతారన్నారు. అలాగే ఎఐసిసి కార్యదర్శి క్రిస్ట్ఫోర్ తిలక్, పిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డిలు విశిష్ట అతిధులుగా పాల్గొంటారని ఆయన అన్నారు. ఈ సమావేశానికి రూరల్ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్నిశ్రేణుల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎం. బంగారునాయుడు, వై. విజయ్‌కుమార్, బి. జగన్నాథరావు, మండే శ్రీనులు మాట్లాడుతూ బుధవారం కొత్తూరు జంక్షన్ నుండి పెద్దఎత్తున ప్రదర్శనగా నర్సీపట్నం వెళ్లేందుకు ఏర్పాట్లు చేసామని తెలిపారు.