విశాఖ

అనకాపల్లిలో ఉద్యానవన పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, జూలై 17: గ్రామీణ జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో వ్యవసాయ ఉద్యానవన కళాశాల ఏర్పాటుకు కృషిచేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలకవర్గ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారయణ తెలిపారు. చింతపల్లి ఉద్యానవన పరిశోధనా కేంద్రంలో మంగళవారం ఏపీ ఉద్యానవన వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలకవర్గ సమావేశంలో ఈ విషయమై ప్రస్తావన తీసుకువచ్చారన్నారు. అనకాపల్లిలో ఉద్యానవన పరిశోధనా కేంద్రం ఈ ఏడాది నుండి అమలులోకి రాగా ఇందుకు అనుబంధంగా ఉద్యానవన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాల్సినవసరం ఎంతైనా ఉందన్నారు. చింతపల్లి ఉద్యానవన పరిశోధనా కేంద్రంలో వౌలిక వసతులను మెరుగుపరచాలని ఇక్కడి దినసరి వేతన కార్మికులకు జీతాలు పెంచాలని, అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తిచేయాలని, ఏజెన్సీలో ఉద్యానవన పంటల సాగును మరింత అనూహ్యంగా పెంచే దిశగా పరిశోధనలు చేయాలన ఈ పాలకవర్గ సమావేశంలో తాను ప్రతిపాదించిన పలు తీర్మానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు. విశాఖ జిల్లాలోని ఆనందపురం ప్రాంతం నుండి రోజుకు నాలుగైదు ట్రక్కుల బంతిపూలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయని, ఏజెన్సీ ప్రాంతంలో బంతిపూల సాగు విస్తీర్ణం బాగా పెంచడం ద్వారా రైతులకు మంచి ఆర్థిక పరిపుష్టి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

వరాహావతారంలో దర్శనమిచ్చిన జగన్నాథ స్వామి
చోడవరం, జూలై 17: జగన్నాథ స్వామి రథోత్సవాల్లో భాగంగా మంగళవారం సుభద్రా బలభద్ర సమేత జగన్నాథ స్వామిని వరాహవతారంలో అలంకరించి ప్రత్యేక పూజలు, విశిష్ట అర్చనలు నిర్వహించారు. తెల్లవారుజాము ఐదుగంటలకే ఆలయ అర్చకులు కృష్ణమాచార్యులు, సీతారామాచార్యులు వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి వేదమంత్రోచ్చారణల నడుమ జగన్నాథస్వామివారిని వరాహవతారంలో అలంకరించి విశిష్ట పూజలు నిర్వహించారు. స్థానిక బోళ్లవీధి ఇంద్రజ్యుమ్న హాలువద్ద స్వామివారిని దర్శించుకునేందుకు పట్టణవాసులతోపాటు వివిధ గ్రామాల నుండి కూడా భక్తులు తరలివచ్చారు. ప్రధానంగా సింహాచలేశుని ఆకారంలో అలంకరించడంతో అప్పన్న భక్తులు స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించారు. దీంతో ఇంద్రజ్యుమ్న ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఉత్సవ కమిటీ చైర్మన్ అలమండ బంగారయ్య, సకలా సూరిబాబు, మోహన్ తదితరులు భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో స్వామివారిని దర్సించుకునేందుకు భక్తులకు వీలు కలిగింది.