విశాఖపట్నం

బ్యాంకింగ్ సేవల్లోకి రోబోట్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖటప్నం, జూలై 17: ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజేషన్, ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్, బ్లాక్‌చైన్ టెక్నాలజీలను ప్రస్తుతం ఉపయోగిస్తున్నామని, ఈ వ్యవస్థలో జరుగుతున్న సైబర్ నేరాలను అడ్డుకునేందుకు రోబోట్‌లు రాబోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు జే.ఏ.చౌదరి తెలియచేశారు. స్థానిక గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగిన ‘్ఫన్‌టెక్ యాత్ర’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చౌదరి మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగం ఇకపై బ్లాక్‌చైన్ టెక్నాలజీ, ఫిన్‌టెక్ పరిజ్ఞానాన్ని మరింత పటిష్ఠం చేయనున్నాయని అన్నారు. హ్యాకింగ్ వంటి సైబర్ నేరాలను నిరోధించడానికి రోబోట్‌లను వినియోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో విశాఖ వేదికగా ప్రపంచ ఫిన్‌టెక్ ఉత్సవాన్ని నిర్వహించనున్నామని చౌదరి వెల్లడించారు. దీనికి 50 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని ఆయన చెప్పారు. ఒక సందర్భంగా నిర్వహించే పోటీల్లో విజేతలకు ఒక మిలియన్ డాలర్లను బహుమతిగా అందించనున్నామని ఆయన చెప్పారు. ఫిన్‌టెక్ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ఐదవ స్థానంలో ఉందని అన్నారు.
ఫిన్‌టెక్ యాత్ర పేరుతో దేశంలోని 15 నగరాల్లోని 500 స్టార్టప్ కంపెనీలను కలపడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఫిన్‌టెక్ యాత్ర వ్యవస్థాపకుడు అభిషాంత్ ఈ సమావేశంలో వెల్లడించారు. నూతన ఆలోచనలతో వచ్చే యువతరం సందేహాలను నివృత్తి చేసి, వారు స్టార్టప్ కంపెనీలు ప్రారంభించడానికి ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిన్‌టెక్ వ్యాలీ సీఈఓ, ఐటీ రంగ ప్రముఖులు, గీతం ప్రోవైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ శివరామకృష్ణ, ఫిన్‌టెక్ అకాడమీ కో-ఆర్డినేటర్ లెబెన్ జాన్సన్ హాజరయ్యారు.