విశాఖపట్నం

కేజీహెచ్‌లో బ్లడ్ బ్యాంక్‌లో రక్తం కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 17: విశాఖ నగరాన్ని డెంగ్యూ వణికిస్తోంది. గతంలో మలేరియా, స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధులు విశాఖ ప్రజలను గడగడలాడించాయి. ఇప్పుడు మలేరియా తగ్గుముఖం పట్టిందనుకుంటే, డెంగ్యూ నగర ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. గడచిన రెండు నెలలుగా విశాఖలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగ్యూ వ్యాధి లక్షణాలతో వందల మంది రోగులు చేరుతున్నారు. మంగళవారం ఒక్కరోజే విశాఖ కేజీహెచ్‌కు వంద మందికిపైగా డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఉన్న రోజులు వచ్చినట్టు ఆసుపత్రి ఆర్‌ఎంఓ బంగారయ్య తెలియచేశారు. వీరిని పరీక్షించగా 37 మందికి డెంగ్యూ వ్యాధి సోకినట్టు నిర్థారించామని అన్నారు. ఇలాగే రోజుకు కనీసం వంద మందికి పైగా డెంగ్యూ లక్షణాలతో కేజీహెచ్‌కు వస్తున్నారని ఆయన తెలియచేశారు. వీరిలో 30 నుంచి 40 మందికి డెంగ్యూ పాజిటివ్ వచ్చిందని ఆయన తెలియచేశారు. ఇదిలా ఉండగా నగరంలోని పలు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో రోజుకూ మరో 150 నుంచి 200 మంది డెంగ్యూ పాజిటివ్ కేసులకు చికిత్స అందిస్తున్నారు.
కేజీహెచ్‌లో దయనీయ పరిస్థితి
కేజీహెచ్‌లో డెంగ్యూ వ్యాధిగ్రస్తులు రోజు రోజుకూ పెరిగిపోతున్నారు. అయితే, వారికి చికిత్స అందించడానికి సరిపడినంత సిబ్బంది లేరు. రోగులు పడుకోడానికి కూడా మంచాలు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకే మంచంపై ఇద్దరు రోగులు పడుకునే వైద్యం చేయించుకునే పరిస్థితి ఏర్పడుతోంది. కేజీహెచ్‌లోని రాజేంద్రప్రసాద్ వార్డు అంతా డెంగ్యూ వ్యాధిగ్రస్తులతో నిండిపోయింది. కొంతమంది రోగులను బల్లలపై పడుకోబెట్టి ఫ్లూయిడ్స్ ఎక్కించే పరిస్థితి ఏర్పడింది.
కేజీహెచ్‌లో రక్తం కొరత
డెంగ్యూ సోకిన వారికి ప్లేట్‌లెట్స్ ఎక్కించాలి. ఇందుకు రక్తం అవసరం ఉంటుంది. అయితే, కేజీహెచ్‌కు డెంగ్యూ వ్యాధిగ్రస్తులు రోజు రోజుకూ పెరిగిపోవడంతో కేజీహెచ్‌లోని బ్లడ్ బ్యాంక్‌లో రక్తం కొరత ఏర్పడింది. దీంతో రోగులు బయట బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తం కొనుగోలు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాంతకమే!
తీవ్రమైన జ్వరం, జలుబు, తలనొప్పితో బాధపడేవారు వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. డెంగ్యూ వ్యాధి నిర్థారణ పరీక్షలు వీలైంత వరకూ కేజీహెచ్‌లోనే చేయించుకోవాలని ఆర్‌ఎంఓ బంగారయ్య తెలియచేశారు. డెంగ్యూ వ్యాధి సోకిన వారికి ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోతాయని, వాటిని త్వరితగతిన ఎక్కించుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. అలాగే బయట తినుబండారాలను తినడం మానుకోవాలని ఆయన చెప్పారు. చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ఆహారం తినడం వలన ఈ వ్యాధి వేగంగా సోకుతుందని అన్నారు. ఇంటి చుట్టుపక్కల కాలువల్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. టైర్లు, కొబ్బరి బొండాల్లో నీరు నిలువ ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలని అన్నారు. వీలైంతవరకూ దోమ తెరలు వాడుకోవాలని ఆయన సూచించారు.
నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం
డెంగ్యూ వ్యాధి లక్షణాలు కలిగిన వారు వెంటనే ప్రాథమిక వైద్యం పొందకపోతే, ఆ ప్రభావం కిడ్నీ, గుండె, ఊరితిత్తులపై పడుతుందని నిపుణులు చెపుతున్నారు. ఒక్కో సందర్భంలో పక్షవాతం కూడా వచ్చే ప్రమాదం ఉందని చెపుతున్నారు. శరీరంలో రక్తం గడ్డకడుందని, ఒక్కో సందర్భంలో శరీరంలోని వివిధ భాగాల నుంచి రక్తస్రావం కూడా అయ్యే ప్రమాదం ఉందని చెపుతున్నారు.