విశాఖ

తెలుగు తమ్ముళ్లపై అధిష్ఠానానికి పిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, జూలై 19: తెలుగుదేశం పార్టీకి అప్రతిష్ట తీసుకువచ్చేలా వ్యవహరించిన పార్టీలోని కొందరు నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ అధిష్టానానికి నియోజకవర్గంలోని కొందరు తెలుగు తమ్ముళ్లు గురువారం పిర్యాదు చేసారు. స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిధి గృహం ఆవరణలో ఈ నెల 18వ తేదిన నిర్వహించిన నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని జరగకుండా ఆందోళన చేసిన వారిపై పార్టీపరంగా క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన పార్టీ ఎం.పి.పి.లు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎం.పి.టి.సి.లు, పార్టీలోని ముఖ్య నాయకులు అదిష్టానానికి పిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. పార్టీ పరువు ప్రతిష్టలను పథకం ప్రకారం దిగజార్చి, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని యత్నించిన కొందరు తెలుగు తమ్ముళ్లపై చర్యలు తీసుకోకపోతే పార్టీ మనుగడ దెబ్బతింటుందని వారు పిర్యాదులో పేర్కొన్నారు. ఇటువంటి వివాదాస్పదమైన వారిపై ఆదిలోనే పార్టీ పరంగా చర్యలు తీసుకోకపోతే మరికొంత మంది ఇటువంటి వాటికి పాల్పడే అవకాశం ఉందని పిర్యాదులో అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. దేశం పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు, జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబులతో పాటు కొంతమంది రాష్ట్ర మంత్రులకు నాయకులు పిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.