విశాఖ

లారీ ఓనర్స్ బంద్ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్యుతాపురం, జూలై 20: అలిండియా లారీల నిరవధిక బంద్‌లో భాగంగా శుక్రవారం అచ్యుతాపురం కనకదుర్గా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు కొమ్మోజు ఈశ్వరరావు, ఉపాధ్యాక్షులు రావి శ్రీనివాసరావు, కార్యదర్శి డీఎస్‌యన్ రాజు, జాయింట్ సెక్రటరీ నర్మాల సంతోష్, కోశాధికారి లాలం రాంబాబు, రెడ్డి ప్రకాశ్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

డివైడర్లను డీకొట్టిన లారీ - తప్పిన భారీ ప్రమాదం
అచ్యుతాపురం, జూలై 20: అతివేగంగా లారీ నడపడం వలన అదుపుతప్పి డివైడర్ల మీదకు దూసెకెళ్లిన సంఘటన శుక్రవారం అచ్యుతాపురం జంక్షన్‌లో చోటుచేసుకుంది. ప్రధాన రహదారిలో గల డివైడర్ల వద్ద ఎటువంటి సిగ్నిల్స్ లేకపోవడంతో శుక్రవారం తెల్లవాజామున నాలుగంటల సమయంలో జనసంచారం లేని సమయంలో జరగడం వలన పెద్ద ప్రమాదమే తప్పింది. సిగ్నల్ లైట్లు లేకపోవడం ఎదురుగా వస్తున్న వాహనాల లేట్లు వలన డ్రైవర్‌కు ఎమి కనిపించలేక పోవడం వలన ఈ ప్రమాదం జరిగింది. మిషన్‌తో డివైడర్లను తొలగించి అతి కష్టంతో లారీను బయటకు తీశారు. కర్మాగారాలకు వెళ్లే వాహనాల వలన అచ్యుతాపురం జంక్షన్‌లో భారీగా ట్రాఫిక్ అంతరాయంతో పాటు ట్రాఫిక్‌సిగ్నిల్స్ ఏర్పాటు చేయకపోవడం వలనే తరుచూ ఎటువంటి ప్రమాదాలు జరిగుతున్నాయని స్థానికలు అంటున్నారు.

పోలీసుస్టేషన్ ఆవరణలో వనం - మనం కార్యక్రమం
అచ్యుతాపురం, జూలై 20: మండల పోలీసుస్టేషన్ ఆవరణలో శుక్రవారం అదనపు ఎస్సై మల్లేశ్వరరావు మరియు ఎ ఎస్సై సింహచం సిబ్బందితో కలసి వనం - మనం కార్యక్రమం చేపట్టారు. స్టేషన్ పరిసరాల ప్రాంతాల్లో సుమారు 50 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది అలీ, లావణ్య, విర్రాజు, రవి తదితరులు పాల్గొన్నారు.