విశాఖ

విద్యాధికారులు అరకులోయ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, జూలై 20: రాష్ట్ర విద్యాశాఖ అధికార గణం అరకులోయ పర్యటనకు విచ్చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. గిరిజన ప్రాంతంలో విద్యా ప్రమాణాలను అధ్యయనం చేసి, విద్యా ప్రమాణాల మెరుగుకు తీసుకోవలసిన అంశంపై రాష్ట్ర విద్యాశాఖ ఉన్నత అధికారులు పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 25,26,27వ తేదీలలో వరుసగా మూడు రోజుల పాటు అరకులోయలో బస చేసి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేసి, అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు చెబుతున్నారు. ఈ సందర్భంగా విద్యా ప్రమాణాల పెంపుకు పలు సూచనలు చేయనున్నారని తెలుస్తోంది. మండలంలోని యండపల్లివలస కస్తూరిభా గాంధీ పాఠశాల, కొత్త్భల్లుగుడ, అరకులోయ పట్టణంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలను అధికారులు తనిఖీ చేయనున్నారు.

చెక్‌డ్యామ్ మరమ్మతులు చేపట్టరూ
కొయ్యూరు,జూలై 20: మరమ్మతులకు గురైన తుమ్మల బంద సమీప చెక్‌డ్యామ్‌ను వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మంప ఎంపీటీసీ శివరామరాజును అక్కడి రైతులు కోరారు. మంప పంచాయతీ తుమ్మల బంద సమీపంలో ఉన్న చెక్‌డ్యామ్ గత మూడేళ్ళుగా మరమ్మతులకు గురి కావడంతో తాగునీరు అందక రైతాంగం ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీంతో స్థానిక మాజీ సర్పంచ్ ఇంగువ హరిమూర్తి పడాల్ సహా అక్డకి రైతులు సమస్యను ఎంపీటీసీకి వివరించారు. శుక్రవారం రైతాంగంతో కలిసి మరమ్మతులకు గురైన చెక్‌డ్యామ్‌ను ఆయన పరిశీలించారు. చెక్‌డ్యామ్ మరమ్మతులకు గురి కావడంతో ఖరీప్ సీజన్‌లో కూడా పంట పొలాలకు నీరందక ఇబ్బందులు పడుతున్నామని అక్కడి రైతులు వాపోయారు. విషయాన్న ఐటీడీ ఎ పీ ఓ దృష్టికి తీసుకువెళ్ళి చెక్‌డ్యామ్ మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకువచ్చే దిశగా కృషి చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు.
విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ
కొయ్యూరు,జూలై 20: విద్యాభివృద్దికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని ఎంపీపీ జి.సత్యనారాయణ అన్నారు. మండలంలోని మర్రివాడ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు శుక్రవారం ఎం ఇ ఓ బోడంనాయుడితో కలిసి ఎంపీపీ ఏకరూప దుస్తులను పంపిణీ చేసారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజన ప్రాంత విద్యార్థులకు పౌష్టికాహార లోపం లేకుండా ఉండేందుకు నూతన మెనూను అమల్లోకి తెచ్చిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి చదివే విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్ళు అందిస్తుందన్నారు. ప్రభుత్వం అందించే సౌకర్యాలను విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు . ఎం ఇ ఓ బోడంనాయుడు మాట్లాడుతూ మండలంలో 1 నుండి 8వ తరగతి వరకు ఉన్న 3,015 మంది విద్యార్థులకు ఏకరూప దుస్తులు వచ్చాయన్నారు. బాలురకు 3,298 జతలు, బాలికలకు 1,366 జతలు కేటాయించడం జరిగిందన్నారు. ఒక్కొక్క విద్యార్థికి రెండు జతలు చొప్పున వీటన్నింటినీ ఆయా పాఠశాలలకు అందించడం జరిగిందని వివరించారు.