విశాఖ

విజయవంతమైన రైలు యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, జూలై 20: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం శుక్రవారం చేపట్టిన అరకు రైలు యాత్ర విజయవంతమయ్యింది. రైల్వే జోన్ సాధన సమితి ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి, మహిళా, ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రజాస్వామ్యవాదులంతా కలిసి విశాఖపట్నం నుంచి అరకులోయ వరకు రైలు యాత్ర చేపట్టారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అన్ని వర్గాలు రైలు యాత్రలో స్వచ్చంధంగా పాల్గొన్నారు. ఊహించిన దానికంటే రాజకీయాలకు అతీంతంగా ఇందులో పాల్గొన్న వారు రైల్వే జోన్‌తో పాటు విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలంటూ నినాదాలు చేసారు. విశాఖపట్నం నుంచి అరకులోయకు చేరుకున్న రైలు యాత్రలో పాల్గొన్న నాయకులందరికీ అరకులోయ వాసులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైల్వే జోన్ సాధన సమితి కన్వీనర్ జె.వి.సత్యనారాయణమూర్తి, సి.పి.ఎం. రాష్ట్ర నాయకుడు బి.గంగరావు మాట్లాడుతూ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రంలోని ఎన్.డి.ఎ. ప్రభుత్వం పరిశీలన పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలను మభ్యపెడుతుందని విమర్శించారు. విభజన హామీలతో పాటు ఎన్నికల మెనిఫెస్టిలో పొందుపరిచిన అంశంగా ఉన్న విశాఖ రైల్వే జోన్‌ను ప్రకటించడంలో తాత్సారం ఎందుకని వారు ప్రశ్నించారు. నాలుగు సంవత్సరాల కాలం పాటు కుంటి సాకులతో కాలయాపన చేసి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ప్రకటించలేదని వారు అన్నారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు కోరుతూ గత పుష్కర కాలంగా వివిధ రూపాలలో ప్రజా ఆందోళన జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన విశాఖ రైల్వే జోన్‌ను సాధించుకునేందుకు నిర్ణయాత్మకమైన చివరి దశ పోరాటంలో ప్రజలు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి భాగస్వామ్యం కావడం శుభ పరిణామమని వారు అన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గతంలో విశాఖపట్నం నుంచి పలాస, ఇచ్చాపురం వరకు యాత్రలు చేపట్టినప్పటికీ కేంద్రం మెండి వైఖరితో వ్యవహరిస్తుందని వారు చెప్పారు. దశాబ్ధాల కాలంగా కాగితాలకే పరిమితమైన రైల్వే జోన్ సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తామని వారు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవించి రైల్వే జోన్‌ను ప్రకటించకపోతే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఉత్తరాంధ్రలో రైలు రోకో కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఐ., సి.పి.ఎం., వైసీపీ, లోక్‌సత్తా, జనసేన పార్టీలు, ఉత్తరాంధ్ర చర్చావేదిక, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక, ఉత్తరాంధ్ర హక్కుల సాధన సమితి, ఉత్తరాంధ్ర జర్నలిస్టు ఫ్రంట్, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు వెంకటరమణ, పైడిరాజు, విమల, హేమంత్‌కుమార్, ఎం.ఎస్.ఎన్.మూర్తి, తిరుపతి, గోవింద్, శరత్‌చంద్ర, కుమార్, కూడ భూషణం, వర్మ, కిల్లో సురేంద్ర, పొద్దు బాలదేవ్, వి.ఉమామహేశ్వరరావు, రామారావు, చిరంజీవి పాల్గొన్నారు.