విశాఖపట్నం

ఎడతెరిపిలేని వర్షం.. చిత్తడిగా నగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 20: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్రవారం తెల్లవారు జాము నుంచి నగరంలో ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో శుక్రవారం నాటి వర్షం నగర ప్రజానీకాన్ని సేదతీర్చింది. సుమారు 18 గంటల పాటు జల్లులుగా తెరిపిలేకుండా కురిసిన వర్షంతో నగరం చిత్తడిగా మారింది. అయితే శుక్రవారం తెల్లవారు జామున ఒక మోస్తరు వర్షం కురియగా నగరంలోని పలు ప్రాంతాలో డ్రెయిన్లు పొంగి ప్రవహించాయి. ఆగకుండా కురిసన వర్షంతో నగర ప్రజానీకం అవస్తలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు కార్యాలయాలకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో రెండు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు అన్ని మండల కేంద్రాల్లోను ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా సీతమ్మధార, వెంకోజీపాలెం, ఆరిలోవ, మాధవధార, గోపాలపట్నం లక్ష్మీనగర్, కంచరపాలెం తదితర ప్రాంతాల్లో కొండవాలులో నివాసం ఉంటున్న వారు మాత్రం ఎడతెరిపిలేని వర్షంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆగకుండా కురుస్తున్న వర్షంతో కొండల నుంచి రాళ్లు జారిపడే ప్రమాదం ఉంది. గతంలో కూడా ఇటువంటి ప్రమాదంలో కొండపై నుంచి రాళ్లు జారిపడగా ముగ్గురు మృత్యువాత పడ్డారు.