విశాఖపట్నం

సమాజహితంగా పారిశ్రామిక రసాయననాల వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 20: పారిశ్రామిక అవసరాలు, ఔషధ తయారీ నిమిత్తం ఉపయోగించాల్సిన రసాయనాల వినియోగంలో సమగ్ర భద్రత అవసరమని ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అన్నారు. అమెరికాకు చెందిన పసిఫిక్ నార్త్‌వెస్ట్ నేషనల్ లేబొరేటరీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ‘రసాయనాల ఉభయ ఉపయోగాలు-పరిరక్షణ’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్‌షాప్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ దేశ భద్రత దృష్ట్యా ప్రమాదకర రసాయనాలు తీవ్రవాదుల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రసాయనాలను ఎరువులు, ఔషధాల తయారీతో పాటు వివిధ పారిశ్రామిక ఉత్పత్తుల తయారీకి వినియోగించడం క్రమేపీ పెరుగుతోందన్నారు. పారిశ్రామిక అవసరాలకు వినియోగించే రసాయనాల భద్రత విషయంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయన్నారు. విశాఖ పరిసరాల్లో పరిశ్రమలలో గడచిన ఏడాదిన్నర కాలంలో జరిగిన పారిశ్రామిక ప్రమాదాలను ఆయన ఉదహరిస్తూ వీటి నివారణకు సూచనలు అందించాలని కోరారు. పసిఫిక్ నార్త్‌వెస్ట్ నేషనల్ లేబొరేటరీ ప్రధాన శాస్తవ్రేత్త డాక్టర్ క్లిఫర్డ్ గంజ్ మాట్లాడుతూ అమెరికాలో 4,400 రసాయన నిల్వ కేంద్రాలపై ప్రభుత్వం నిఘా ఉంచడమే కాకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతుందన్నారు. రసాయనాలు ఉగ్రవాదుల చేతిలో పడితే సమాజ విద్వంసానికి దారితీయగలదన్నారు. పరిశ్రమల్లో యంత్రాల నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న దృష్ట్యా సైబర్ దాడులతో రసాయనాలను వినాశనానికి దారితీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎంఎస్ ప్రసాదరావు అధ్యక్షత వహించగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్తవ్రేత్తలు డాక్టర్ ఎస్ ప్రభాకర్, కే శ్రీనివాస్, ఇండియన్ కెమికల్ కౌన్సిల్ నిపుణుడు డాక్టర్ నారాయణ, నార్త్‌వెస్ట్ లేబొరేటరీ శాస్తవ్రేత్తలు కెనె్నత్ ఫర్గూసన్, డాక్టర్ మోతుకూరి రాధాకృష్ణ తద ఇతరులు పాల్గొన్నారు.