విశాఖ

మంచినీటి ఎద్దడితో అవస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరవాడ, మే 13: ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్వగ్రామమైన వెనె్నలపాలెం గుల్లవారి వీధి ప్రజలు మంచినీటి కోసం అవస్థలు ప డుతున్నారు. గుల్లవారివీధిలో నివాసం ఉంటున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని పంచాయ తీ పాలకవర్గం ఆరు నెలలు క్రి తం కొళాయి కనెక్షన్‌ను ఏర్పాటు చేశారు. కొళాయి కనెక్షన్ ఏర్పాటుచేసిన దగ్గర నుండి నేటివరకు ప్రజలకు మంచినీటిని అందించడం లేదని వైకాపా జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వెనె్నల సన్యాసిరావు తెలిపారు. ఈ సమస్యను గుల్లవారివీధి మహిళలు తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. మంచినీటి సమస్యను పరిష్కరించాలని మండలాభివృద్ధి అధికారిణి దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని సన్యాసిరావు తెలిపారు. ఆ వీధిలో నివాసం ఉంటున్న కొంతమంది పెద్దలు వీధి కుళాయిలకు విద్యుత్ మోటార్లను అమర్చి వారివారి ఇళ్ల ట్యాంకులకు నీరును ఎక్కించుకుంటున్నారని సన్యాసిరావు తెలిపారు. దీని కారణంగానే గుల్లవారివీధికి మంచినీరు అందడం లేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, మండల పరిషత్ అధికారులు వెనె్నలపాలెంలోని గుల్లవారివీధిలో నివాసం ఉంటున్న కుటుంబీకులకు మంచినీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సన్యాసిరావు కోరారు.