విశాఖపట్నం

గంగా నది పవిత్రతను కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 14: గంగా నది పవిత్రతను కాపాడుతూనే, కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలని కోరుతూ ప్రొఫెసర్ జీడీ అగర్వాల్ చేస్తున్న దీక్షకు జనసేన సంఘీభావం తెలిపింది. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్షణమే కేంద్రం స్పందించాలని డిమాండ్ చేశారు. గంగానది కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ అగర్వాల్ గత 50 రోజులుగా చేస్తున్న దీక్షను విరమింపచేయాలని సత్య సూచించారు. గంగానది నిర్మలంగా, కాలుష్య రహితంగా ఉండాలన్న కాంక్షతో కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని కోరారు. దివంగత ప్రధాని ఇందిర హయాంలో కాలుష్య నియంత్రణ మండలిలో పనిచేసిన అగర్వాల్ గంగా నది కోసం నిరంతరం పోరాడుతున్నారని గుర్తు చేశారు. గత ఎన్నికల ముందు కూడా మోదీ గంగా నది ప్రక్షాళన, తదితర అంశాలపై స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీని గుర్తు తెచ్చుకుని, గంగ ప్రక్షాళనకు చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ వీసీ ప్రొఫెసర్ కేఎస్ చలం మాట్లాడుతూ ఐదు రాష్ట్రాలకు గంగా నది జీవనాడి వంటిదని, దీన్ని స్వచ్ఛంగా, కాలుష్య రహితంగా ఉంచేందుకు ప్రత్యేక చట్టం అవసరమని అభిప్రాయపడ్డారు. యూపీ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా న్యాయస్థానం నుంచి అనుమతి తెచ్చుకుని, దీక్ష కొనసాగిస్తున్నారన్నారు. పర్యావరణానికి నష్టం కలిగించని విధంగా అభివృద్ధి జరిగేందుకు అగర్వాల్ చేస్తున్న దీక్షకు జనసేన మద్దతిస్తుందన్నారు. అగర్వాల్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జనసేన ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి టీ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.