విశాఖ

పనితీరును మెరుగుపరుస్తాం. పథకాలను అమలు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, ఆగస్టు 16: విశాఖ మన్యంలో తమ శాఖ పనితీరును గిరిజన రైతులకు ప్రయోజనాత్మకంగా తీర్చిదిద్ది వారి అభ్యున్నతికి వినూత్న పథకాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య శాఖల ప్రిన్సిపాల్ కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో తమ శాఖ పనితీరు ప్రస్తుతం ఆశాజనకంగా లేదని అన్నారు. గిరిజన రైతుల అభివృద్దికి ఎన్నో మంచి పథకాలు సబ్సిడీపై ఉన్నప్పటికీ తమ శాఖ పనితీరు సక్రమంగా లేకపోవడంతో వాటిని అమలు చేయలేకపోతున్నట్టు ఆయన చెప్పారు. ఏజెన్సీలో సిబ్బంది కొరత పట్టిపీడిస్తుండడంతో ఎన్నో పథకాలు గిరిజన రైతుల దరి చేర్చలేకపోతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఏజెన్సీ డివిజనల్ కేంద్రమైన పాడేరులో పశు సంవర్థక శాఖకు డిప్యూటీ డైరెక్టర్, మత్స్యశాఖకు అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు ఉన్నప్పటికీ ఇంతవరకు ఈ పోస్టులు భర్తీకాకపోవడంతో గిరిజన ప్రాంతంలో మందకొడిగా కార్యకలాపాలు సాగించాల్సి వస్తున్నట్టు ఆయన చెప్పారు. అయితే త్వరలోనే ఈ పోస్టులను భర్తీ చేసి పశు సంవర్థక, మత్స్య శాఖల పనితీరును వేగవంతం చేయడమే కాకుండా గిరిజనులకు ప్రయోజనాత్మకమైన పథకాలను అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఏజెన్సీలో క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సిన సిబ్బంది కొరత కూడా అధికంగా ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు ఈ సమస్యను పరిష్కరిస్తామని, అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. గిరిజనులకు మత్స్య, పశు సంవర్థక శాఖల పథకాలను నూరుశాతం రాయితీపై అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు. తమ శాఖల ద్వారా 75, 90 శాతం రాయితీపై ఉన్న పథకాలను శత శాతం రాయితీపై అందించేందుకు ఐ.టి.డి.ఎ. సహాకారం తీసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారితో చర్చించామని ఆయన అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నూరు శాతం రాయితీపై చేపల నీటి కుంటలు తవ్వే పథకాలు ఉన్నట్టు ఆయన చెప్పారు. చేపల పెంపకాన్ని చేపట్టే రైతులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు అవసరమైతే వాహనాలను సమకూర్చనున్నట్టు ఆయన పేర్కొన్నారు. గోకులం పథకం కింద ఒకే చోట 20 పశువులు ఉంటే 21 లక్షల రూపాయల వ్యయంతో షెడ్లు నిర్మించడమే కాకుండా వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఏజెన్సీలో బల్క్ కూలింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కూడా తాము సిద్దంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. అయితే ఐ.టి.డి.ఎ.తో తమ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి పనిచేస్తే ఎన్నో పథకాలు గిరిజన రైతులకు ఉపయోగకరంగా అమలు చేయవచ్చునని ఆయన అన్నారు. పశు, మత్స్యశాఖలలో అందుబాటులో ఉన్న పథకాలపై గిరిజనులు అవగాహన ఏర్పరచుకుని వీటిని వినియోగించుకునేందుకు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారిని సంప్రదించాలని ఆయన సూచించారు. గిరిజన ప్రాంతంలో ఐదు వందల మంది పశు మిత్ర సభ్యులకు శిక్షణ ఇస్తున్నామని, వీరి ద్వారా గిరిజనులకు మెలైన సేవలు అందించవచ్చునని ఆయన అన్నారు. ఏజెన్సీలో పశు మరణాలను నివారించేందుకు వాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, త్వరలో ఐదు మొబైల్ క్లినిక్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పశు మరణాలు సంబవించినపుడు గిరిజనులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు బీమా పథకాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ పథకంలో సభ్యులైన వారి పశువులు వ్యాధులతో మృతి చెందితే 60 వేల రూపాయల వరకు బీమా చెల్లించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఆయన చెప్పారు. బీమా ప్రీమియం కూడా రైతులు చెల్లించకుండా తామే భరించే విధంగా కూడా ఆలోచన చేస్తున్నట్టు ఆయన అన్నారు. రానున్న ఆరు నెలల కాలంలో ఏజెన్సీలో తమ శాఖల పనితీరును మెరుగుపరిచి మంచి ఫలితాలను సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ఏజెన్సీలో 620 మంది చేపల పెంపకందారులు ఉన్నప్పటికీ వీరంతా సొసైటీలో నమోదు కాకపోవడం వలన ప్రభుత్వ పథకాల అమలుకు ఇబ్బందులు ఉన్నాయని ఆయన అన్నారు. చేపల పెంపకందారులు తప్పనిసరిగా సొసైటీలో నమోదు కావాలని, ఇందుకోసం తమ సిబ్బంది వారికి అవగాహన కల్పిస్తారని ఆయన అన్నారు. గిరిజన రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైతే ప్రస్తుతం ఉన్న నిబంధనలను సడలించేందుకు కూడా సిద్దంగా ఉన్నామని కృష్ణ ద్వివేది చెప్పారు. విలేఖరుల సమావేశంలో పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజి, మత్స్యశాఖ అదనపు సంచాలకులు పి.కోటేశ్వరరావు, పశు సంవర్థఖ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్.కోటేశ్వరరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.