విశాఖపట్నం

శోకసముద్రంలో బీజేపీ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 16: మాజీ ప్రధాని వాజ్‌పేయి మరణంతో జిల్లాలోని బీజేపీ నేతలు శోక సముద్రంలో మునిగిపోయారు. వాజ్‌పేయి అస్వస్థతకు గురైన తరువాత స్థానికంగా ఉన్న బీజేపీ నేతలు అనేక మంది ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి వచ్చారు. వాజ్‌పేయి మరణంతో ఒక మహా నాయకుడిని కోల్పోయామంటూ బీజేపీ నేతలు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ప్రతిపక్ష నాయకునిగా కూడా మెప్పించిన వాజ్‌పేయి
వాజ్‌పేయి ప్రధానిగా దేశ ప్రజల మన్ననలు అందుకున్నారు. ఆయన లోక్‌సభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు కూడా ఎవ్వరిపైనా కువిమర్శలు చేయలేదని ఎంపీ హరిబాబు అన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులే కానీ, శత్రువులు ఉండరని నమ్మిన వ్యక్తి వాజ్‌పేయి అని ఆయన అన్నారు. దేశం ఆర్థిక వృద్ధి పెరగడానికి వాజ్‌పేయి కారణమని అన్నారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా దేశంలోని అనేక గ్రామాలకు రోడ్లు నిర్మించేందుకు ఆయన చర్యలు తీసుకున్నారని హరిబాబు చెప్పారు. పేద ప్రజల కోసం వాంబే ఇళ్లను నిర్మించారని, సెల్‌ఫోన్‌లు, గ్యాస్ కనెక్షన్లు అందుబాటులోకి తీసుకువచ్చారని అన్నారు.

వాజ్‌పేయి కవిగా నాకు ఇష్టం
వాజ్‌పేయి ఒక కవిగా తనకు ఎంతో ఇష్టమని రాజ్యసభ మాజీ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఐక్యరాజ్యసభలో హిందీ కూడా ఒక అధికార భాషగా ఉండలనా వాజ్‌పేయి తపనపడేవారని అన్నారు. ఇందుకోసం విద్యానివాస్ మిశ్రను, తనను ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఐక్యరాజ్యసమితి ప్రతినిధులతో చర్చించేందుకు పంపించారని యార్లగడ్డ చెప్పారు. పార్లమెంట్ ఆవరణలో తను, సీ.నారాయణరెడ్డి హిందీలో కవితలు చెపుతున్నప్పుడు వాజ్‌పేయి ఆసక్తిగా వింటూ, కవిత రూపంలోనే బదులిచ్చేవారని అన్నారు. ఐక్యరాజ్యసమితిలో హిందీ భాషను అధికార భాషగా పరిగణించేలా చేయడమే వాజ్‌పేయికి నిజమైన నివాళి అని లక్ష్మీప్రసాద్ అన్నారు. ఒక అసాధారణ నేతను ఈరోజు మనం కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గొప్ప స్నేహితుడిని కోల్పోయాను!
తన రాజకీయ ఎదుగుదలకు ఎంతగానో సహకరించడమే కాదు, అనేక అంశాల్లో తనకు మార్గదర్శకునిగా, స్నేహితునిగా ఉన్న వాజ్‌పేయి ఇక లేరన్న వార్త తనను ఎంతగానో కలచివేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు పీ.వీ.చలపతిరావు ఆవేదన వ్యక్తం చేశారు. వాజ్‌పేయి విశాఖ వచ్చినప్పుడు ముందుగా తనతోనే మాట్లాడేవారని, విశాఖలో పార్టీ ఆవిర్భావం, ఎదుగుదలకు తామిద్దరం అనేకసార్లు చర్చించుకున్నామని అన్నారు. వాజ్‌పేయి కర్మయోగి అని, అటువంటి నాయకుడిని కోల్పోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
వాజ్‌పేయి జీవితం ఆచరణీయం
వాజ్‌పేయి ఒక యోగి. ఒక అసాధారణ రాజకీయ నాయకుడు. అజాత శత్రువు. అటువంటి నేత జీవితాన్ని భవిష్యత్ తరాలు ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్సీ పీ.వీ.ఎన్.మాధవ్ అన్నారు. వాజ్‌పేయి తన జీవితంలో ఎవ్వరినీ నొప్పించిక, తానొవ్వక అందరితో సఖ్యతగా మెలిగారని అన్నారు.
ఇదిలా ఉండగా వాజ్‌పేయి మరణం పట్ల బీజేపీ నాయకులు బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు, పీ.వీ.నారాయణ, నాగేంద్ర, మాజీ మేయర్, పార్టీ జోనల్ కమిటీ నాయకులు పులుసు జనార్థనరావు తదితరులు సంతాపాన్ని తెలియచేశారు.