విశాఖపట్నం

విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన వాజ్‌పేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 16: వాజ్‌పేయి అంటే వాక్ చాతుర్యం, సమయస్ఫూర్తి, రాజకీయ ఎత్తుగడలు గుర్తుకొస్తాయి. మృదు స్వభావి అయిన వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ అనే మొక్కను నాటి, జాతీయ స్థాయిలో దాన్ని మహా వృక్షంగా పెంచి, దేశానికి ఓ గొప్ప పాలన అందించిన నేతగా అందరి మదిలో నిలిచిపోతారు. దేశ ప్రధానిగా పనిచేసినప్పుడు ఆయన విశాఖపై ప్రత్యేక ప్రేమాభిమానాలు కురిపించారు. ఎన్నో వరాలు ఇచ్చారు. విశాఖ రూపు రేఖలను మార్చారు. విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయాన్ని కట్టబెట్టారు. పారిశ్రామికవాడైన విశాఖలో పరిశ్రమలు నష్టాల ఊబిలో కూరుకుపోతుంటే, వాటిని ఆర్థికంగా ఆదుకుని, లాభాల బాట ఎక్కించారు.
జనసంఘ్‌లో వాజ్‌పేయి పనిచేసినప్పుడు విశాఖ, విజయవాడ, హైదరాబాద్‌ల్లో జరిగిన అనేక సభల్లో ఆయన పాల్గొన్నారు. జనసంఘ్ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన విశాఖలో పలుసార్లు సమావేశాలు నిర్వహించారు.
* 1957లో విశాఖలో ఆయన మేధావులతో భేటీ అయ్యారు. 1967లో జరిగిన ఎన్నికల్లో ఆయన విశాఖలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఆ ఎన్నికల్లో జనసంఘ్ విజయనగరం, నెల్లూరు, పరకాల నియోజకవర్గాల్లో విజయం సాధించింది.
* 1972లో శ్రీకాకుళం జిల్లా హరిశ్ఛంద్రపురం నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికలో జనసంఘ్ అభ్యర్థి తరపున ప్రచారం చేయడానికి వాజ్‌పేయి విశాఖ నుంచే బయల్దేరి వెళ్లారు. 1977లో విజయవాడలో జనసంఘ్ సమావేశం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పీ.వీ.చలపతిరావు ఆధ్వర్యంలో జరిగింది. ఆ సమావేశానికి వాజ్‌పేయి హాజరయ్యారు.
* 1981లో విశాఖ మున్సిపాలిటీకి ఎన్నికలు వచ్చాయి. అప్పట్లో బీజేపికి విశాఖలో పీ.వీ.చలపతిరావు, ఎన్.ఎస్.ఎన్.రెడ్డి కీలక భూమికను పోషించేవారు. ఈ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసేందుకు వాజ్‌పేయి ఇక్కడికి వచ్చి, మూడు రోజులు ఇక్కడే ఉన్నారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగిన బహిరంగ సభకు విశేషంగా జనం హాజరయ్యారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. దక్షిణ భారత దేశంలోనే బీజేపీ గెలుచుకున్న తొలి మున్సిపాలిటీ విశాఖ కావడం గమనార్హం.
* 1987లో విశాఖలో బీజేపీ భారీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ సభ జరగాల్సి ఉంది. వర్షం సమావేశానికి అడ్డంకిగా మారడంతో, ఆ సమావేశాన్ని ఏయూ కాన్వొకేషన్ హాలులోకి మార్చారు. అప్పట్లో స్థానిక బీజేపీ నేతలు ఐదు లక్షల రూపాయలు పార్టీ ఫండ్‌గా వాజ్‌పేయికి అందించారు.
* 1998లో అనకాపల్లిలో బీజేపీ భారీ బహిరంగ సభ జరిగింది. ఆ సమావేశంలోనే ముద్రగడ పద్మనాభం, మోహన్‌బాబు, దగ్గుబాటి, శ్రీహరి తదితరులు బీజేపీలో చేరారు. ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో వాజ్‌పేయి చేసిన ప్రచారం కారణంగా బీజేపీకి 14 శాతం ఓట్లు లభించాయి.
* విశాఖ నగరాన్ని ఢిల్లీ తరహాలో అభివృద్ధి చేయాలని వాజ్‌పేయి కలలుకనేవారు. ఇందుకోసం ఎన్‌ఎస్‌ఎన్‌రెడ్డి, పీ.వీ.చలపతిరావుతో పిలిపించుకుని ఆయన చర్చించారు. ఈ రోజు బీచ్ రోడ్డు ఆవిర్భావం ఆ చర్చల ఫలితమే.
* 2004లో హరిబాబు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రధాని హోదాలో ఉన్న వాజ్‌పేయి విశాఖకు పెద్దఎత్తున వాంబే గృహాలు మంజూరు చేశారు. అదే సమయంలో విశాఖ-సికిందరాబాద్ మధ్య తిరిగే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు చంద్రబాబు అభ్యర్థన మేరకు జన్మభూమిగా నామకరణం చేశారు. అలాగే విశాఖ-బెంగళూరు మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ వాజ్‌పేయి చొరవతోనే వచ్చింది. పోర్టు కనెక్టివిటీ రోడ్డు కూడా వాజ్‌పేయి హయాంలోనే వచ్చింది.