విశాఖ

మన్యంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రణాళికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, ఆగస్టు 17: విశాఖ మన్యంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజీ అధికారులను ఆదేశించా రు. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులు, మత్య్సకారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో గిరిజన మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి, వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు వివిధ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంద న్నారు. ఏజెన్సీలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి అనువైన చెరువులను గుర్తించాలని స్వచ్చంద సంస్థల ప్రతినిధులను ఆయన కోరారు. మన్యంలో ఆధునిక శాస్ర్తియ విధానాలతో చేపల పెంపకాన్ని చేపడితే మంచి ఫలితాలు సాధించవచ్చునని అన్నారు. పాడేరులోని చే పల ఉత్పత్తి కేంద్రాన్ని పునరుద్ధరించి ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ ఉత్పత్తి కేంద్రం ద్వారా నాణ్యమైన చేపలను వినియోగదారులకు అందిం చేలా పాడేరు పట్టణ ంలో చేపల దుకాణాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అరకులోయ మండలం సిమిలిగుడ గ్రామంలోని చేపల ఉత్పత్తి కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. గిరిజన ప్రాంతంలో పశుసం వర్థక శాఖ పనితీరును సమర్థంగా నిర్వహించాల్సి ఉందని, ఇందుకోసం గ్రా మాలలో పశుమిత్రలను ఏర్పాటు చే యాలన్నారు. గిరిజన గ్రామాలలో ప శుమిత్ర సభ్యులను గుర్తించాలని ఆయ న ఆదేశించారు.