విశాఖ

27న అనకాపల్లికి రానున్న జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, ఆగస్టు 17: ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి ఈనెల 27వతేదీన సాయంత్రం అనకాపల్లిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారని పార్టీ అనకాపల్లి లోక్‌సభ కమిటీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. ఈ సమావేశంలో అనకాపల్లి నియోజకవర్గంలో పరిష్కారానికి నోచుకోని పలు ప్రధాన సమస్యలతోపాటు తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ ఉనికిపై ఒక స్పష్టమైన ప్రకటన చేయనున్నారని తెలిపారు. రాష్ట్రంలో మూతపడిన సుగర్ ఫ్యాక్టరీల ఉనికిని కాపాడే విషయంలో తునిలో జరిగిన సభలో ఇప్పటికే ఒక ప్రకటన జగన్ చేశారన్నారు. వైఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మూతపడిన ఫ్యాక్టరీలను తిరిగి తెరిపించే చర్యలను తీసుకున్నారన్నారు. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తుమ్మపాలతోపాటు మిగిలిన ఫ్యాక్టరీలన్నీ యథావిథిగా మూతపడ్డాయన్నారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తుమ్మపాల ఫ్యాక్టరీ మూతపడటమే కాకుండా ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకు, ఉద్యోగులకు నెలలు తరబడి జీతాలు అందని పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇటువంటి పరిణామాల నేపధ్యంలో తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ దుస్థితిని ఇక్కడి కార్మికులు, ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసే రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను జిల్లాకు చేరుకున్న జగన్‌కు ఇప్పటికే వివరించామన్నారు. శనివారం సాయంత్రం నర్సీపట్నం జంక్షన్‌లో జగన్ పాదయాత్ర సభ జరుగుతుందన్నారు. యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జిల్లాలో అన్ని ప్రాంతాలకంటే ఎక్కువ గా ఐదురోజులపాటు ప్రజాసంకల్ప యాత్ర సాగుతుందన్నారు. జి ల్లాకు జగన్ ప్రజాసంకల్పయాత్ర చేరిందే తడవుగా అనూహ్య సంఖ్య లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. జగన్ సిఎం ఎప్పుడు అ వుతారా? అనే ఆసక్తితో ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. చంద్రబా బు ప్రభుత్వ ప్రజా వ్య తిరేక విధానాలతో విసిగిపోయిన ప్రజలు జగన్‌మోహన్ రెడ్డి సిఎం కావాలని ఆకాంక్షిస్తున్నారని, ఇటువంటి తరుణంలో జిల్లాలో జరుగుతు న్న జగన్ యాత్ర ప్రాముఖ్యతను సంతరించుకోనుందని తెలిపారు. అనకాపల్లి బైపాస్ రోడ్డు జంక్షన్ నుండి నియోజకవర్గంలోకి ప్రజాసంకల్పయాత్ర 27న చేరుతుందన్నారు. అదేరోజు సాయంత్రం నెహ్రూచౌక్ జంక్షన్‌లో బహిరంగ సభ జరుగుతుందని, మరుసటి రోజు ఉదయం తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ రైతులతో ముఖాముఖి సాగుతుందని ఆయన పేర్కొన్నారు. అక్కడి నుండి ఊడేరు, బవులవాడ, మామిడిపాలెం మీదుగా చోడవరం అసెంబ్లీకి ప్రజాసంకల్ప యాత్ర చేరుతుందన్నారు.
ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్ మాట్లాడుతూ జగన్ ప్రజాసంకల్పయాత్రకు అనకాపల్లి అసెంబ్లీ పరిధిలో అనూహ్య ంగా ప్రజలు, పార్టీశ్రేణు లు తరలిరానున్నారన్నారు. తటస్థంగా ఉన్న నేతలతోపాటు ప్రత్యర్ధి పార్టీ నేతలు సైతం వైసీపీలో చేరేందుకు తహతహ లాడుతున్నారన్నారు.
మండల వైసీపీ అధ్యక్షుడు గొర్లి సూరిబాబు, మంఢల పార్టీ ప్రధాన కా ర్యదర్శి భీశెట్టి జగన్ పాల్గొన్నారు.

నేడు జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం
నాతవరం, ఆగస్టు 17: మండలం ములగపూడి గ్రామం నుండి ఒకరోజు విరామం తర్వాత జగన్ పాదయాత్ర శనివారం నుంచి కొనసాగుతుందని నియోజకవర్గం కన్వీనర్ పెట్ల ఉమాశంకర్ గణేష్ శుక్రవారం విలేఖరులకు తెలిపారు. శనివారం ఉదయం ములగపూడి నుంచి మెట్టపాలెం, బెన్నవరం, కృష్ణాపురం మీదుగా బయపురెడ్డిపాలెం చేరుకుంటుందన్నారు. మధ్యాహ్నం స్వల్ప విరామం తదుపరి నర్సీపట్నంలో బహిరంగ సమావేశానికి హాజరవుతారన్నారు. పెదబొడ్డేపల్లి ఆర్‌సీఎం ప్రాంగణంలో రాత్రి బస చేస్తారన్నారు. ఆదివారం ఉదయం ప్రజా సంకల్ప యాత్ర ధర్మసాగరం మీదుగా కోటవురట్ల మండలానికి చేరుకుంటుందని గణేష్ తెలిపారు.