విశాఖ

ప్రమాద స్ధాయికి చేరిన డొంకరాయి రిజర్వాయర్ నీటిమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, ఆగస్టు 17: ఇటీవల కు రిసిన వర్షాలకు డొంకరాయి జలాశయం నీటిమట్టం ప్రమాద స్థా యికి చేరడంతో జెన్‌కో అధికారు లు మెయిన్‌డ్యామ్ రెండు గేట్లు ద్వారా నాలుగువేల క్యూసెక్కులు నీటిని దిగువ ప్రాంతానికి విడుద ల చేస్తున్నారు. డొంకరాయి జలాశయం పూర్తి నీటిమట్టం 1037 అడుగులు కాగా, ఇటీవల కురిసిన వర్షాలకు గురువారం సాయంత్రం నాటికి 1034 అడుగులకు చేరింది. దీంతో సీలేరు కాంప్లెక్స్ జెన్‌కో సీఇ మోహన్‌రావు , ఎస్‌ఇ మురళీమోహన్ ఆధ్వర్యంలో డొంకరాయి జలాశయం వద్ద సిబ్బందిని అప్రమత్తం చేశారు. గురువారం రాత్రి నుంచి డొంకరాయి నుంచి నాలుగువేల క్యూసెక్కులు వలసగెడ్డ, పాలగెడ్డ , మంగంపాడు వాగుల నుంచి ఇన్‌ఫ్లో వచ్చి అధికంగా చేరడంతో శుక్రవారం 11 గంటలకు డొంకరాయి జలాశయంలో 1036.7 అడుగులకు నీటిమట్టం చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు రెండు గేట్లు ఎత్తి నాలుగువేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. 1036.7 అడుగుల నీటిమట్టం పెరగకుండా జెన్‌కో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈసందర్భంగా సీఇ మోహన్‌రావు డొంకరాయి జలాశయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గేట్లు నుంచి విడుదల చేశారు.