విశాఖపట్నం

స్టీల్ ప్లాంట్‌కు తీరనున్న ఐరన్‌ఓర్ కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 17: సొంత గనులు లేక ఇబ్బంది పడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌కు త్వరలోనే ఆ సమస్య కొంత వరకూ పరిష్కారం కాబోతోంది. బైలధిల్లా గనుల నుంచి ఐరన్ ఓర్ ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చేరుకుంటోంది. ఐరన్ ఓర్ రవాణా ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో, స్టీల్ ఉత్పత్తి వ్యయం ఇబ్బడి ముబ్బిడిగా పెరుగుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గట్టి పోటీని ఎదుర్కొంటున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పటికప్పుడు నాణ్యమైన ఉక్కును ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు మార్చుకుంటూ వెళుతోంది. ప్లాంట్ రెండో దశ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా సొంత గనులు లేకపోవడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రస్తుతం బైలధిల్లా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఐరన్ ఓర్‌తోపాటు, మంగళూరు నుంచి ఐరన్ ఓర్ పిలెట్స్‌ను తెప్పించుకుంటోంది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న కుద్రెముఖ్ ఐరన్ ఓర్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐఓసీఎల్) మంగళూరులో ఐరన్‌ఓర్ పిలెట్ యూనిట్‌ను నెలకొల్పింది. ఇక్కడి తయారు చేసిన పిలెట్‌లను విశాఖ స్టీల్ ప్లాంట్ దిగుమతి చేసుకుంటోంది. ఈ పిలెట్‌లను టన్ను 2000 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తోంది.
నాణ్యమైన పిలెట్‌లు
పిలెట్ల తయారీలో కేఐఓసీఎల్‌కు మంచి పేరు ఉంది. బైలధిల్లా గనుల నుంచి ఐరన్ ఓర్‌ను దిగమతి చేసుకుని, దాన్ని శుద్ధి చేసి, నాణ్యమైన పిలెట్లను తయారు చేసి ఉక్కు పరిశ్రమలకు సరఫరా చేస్తుంటుంది. బకోరా స్టీల్ ప్లాంట్‌కు ఏటా 1.5 మిలియన్ టన్నుల పిలెట్లను సరఫరా చేస్తోంది. ఈ పిలెట్ల వినియోగం వలన ఉత్పత్తి ఖర్చులు తగ్గడమే కాకుండా, నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి అవుతుంది. 2017లో ఈ ఐరన్‌ఓర్ పిలెట్స్ దేశంలోని వివిధ స్లీట్ ప్లాంట్ల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు ఇటువంటి యూనిట్‌ను ఉక్కునగరంలో ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ ప్లాంట్ కోసం స్టీల్ ప్లాంట్ 75 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించింది. ఇప్పటికే టెక్నికల్ ఫీజ్‌బులిటీ రిపోర్ట్‌ను కేఐఓసీఎల్‌కు అందచేసింది. మెకాన్ సంస్థ డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈనెలాఖరుకు అందచేయనుంది. ఇవన్నీ పూర్తయితే, కేఐఓసీఎల్, ఆర్‌ఐఎన్‌ఎల్ జాయింట్ వెంచర్‌గా పిలెట్ యూనిట్‌ను మొదలుపెట్టబోతోంది. 2021 నాటికి ఈ పిలెట్ యూనిట్ అందుబాటులోకి రానుంది.