విశాఖపట్నం

డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జిగా కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 17: డీసీసీబీ చైర్మన్ల పదవీ కాలం పొడిగింపులో ప్రభుత్వం రాజకీయ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల చైర్మన్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్‌ల పదవీ కాలాన్ని పొడిగించలేదు. అనంతపురం, ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవీ కాలం ఇంకా మూడు నెలలు ఉంది. అందువలన వాటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మిగిలిన తొమ్మిది డీసీసీబీ చైర్మన్‌ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌కు జిల్లా కలెక్టర్‌ను పర్సన్ ఇన్‌చార్జ్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కాగా, డీసీసీబీ చైర్మన్‌గా సుకుమార వర్మ వ్యవహరించిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల తరువాత సుకుమార వర్మ తండ్రి, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు టీడీపీలో చేరారు. సుకుమారవర్మ పదవీ కాలం ఆరు నెలల కిందటే ముగిసినా, వర్మ, ఆయన తండ్రి కన్నబాబు రాజు టీడీపీలో ఉన్నందువలన వర్మను ఆ పదవిలో కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొద్ది కాలం కిందట వీరిద్దరూ వైసీపీలో చేరారు. అప్పటి నుంచి కన్నబాబు రాజుపై కేసు వేధింపు మొదలైంది. రాష్ట్రంలోని పలు డీసీసీబీ చైర్మన్‌ల పదవీ కాలాన్ని పొడిగించినా, వర్మకు ఆ ఛాన్స్ ఇవ్వకపోవడం కేవలం ఆయన వైసీపీలో చేరడం వలనే జరిగిందని రాజకీయ వర్గాలు చెపుతున్నాయి. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ తను చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు బ్యాంక్ ఆదాయం 450 కోట్ల రూపాయలు ఉండేదని, దాన్ని ఇప్పుడు 1259 కోట్ల రూపాయలకు తీసుకువచ్చి, బ్యాంకును అభివృద్ధి చేస్తున్నా, తనన పదవిలో కొనసాగించకపోవడం రాజకీయ కారణమేనని అన్నారు.