విశాఖపట్నం

సమస్యల పరిష్కారానికే వార్డుదర్శిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, ఆగస్టు 17: ప్రజల సమస్యల పరిష్కార వేదికగా వార్డు దర్శని నిలుస్తోందని జీవీ ఎంసీ కమిషనర్ హరినారాయణన్ అన్నారు. నగరంలోని మూడో జోన్‌లోని 24వ వార్డులో శుక్రవారం నిర్వహించిన వార్డు దర్శిని కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలను సందర్శించి పలు సూచనలు చేశారు. పాఠశాలను అందంగా తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పధకాలు సకాలంలో అర్హులైన వారికి అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏ పధకం అందకపోయినా నేరుగా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. అనంతరం వార్డులో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి, యుసీడీ పీడీ శ్రీనివాసన్, జోనల్ కమిషనర్ చిట్టిబాబు, ఏసీపీ సత్యనారాయణ, ఈ ఈ కేశవరెడ్డి, డి ఈ రమేష్, స్థానికులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న వస్త్ర ప్రదర్శన
* సందడి చేసిన ఇండియా కల్చరల్ అంబాసిడర్ పూజాగబా శారదా
జగదాంబ, ఆగస్టు 17: నగరంలోని బీచ్‌రోడ్డులోని ఓ హోటల్‌లో నిర్వహించిన చేనేత వస్త్ర ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఆషాడమాసం, శ్రావణమాసం నేపథ్యంలోప్రత్యేకంగా చేనేత వస్త్రాలు, ఫ్యాషన్ ప్రపంచంలో రోజుకో కొత్త రంగులతో వస్తున్న వస్త్రాలను తిలకించేందుకు మహిళలు అధిక సంఖ్యలో వస్తున్నారు. సెకండ్ స్కిన్ ప్రదర్శన పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఇండియా కల్చరల్ అంబాసిడర్ పూజా గబా శారదా ముఖ్యఅతిథిగా హాజరై శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అతివులకు మరింత అందానిచ్చేది కట్టుబొట్టునేన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన చేనేత కళాకారులు ఈ ప్రదర్శనలో అమ్మకాలు సాగిస్తున్నారు. వారణాసి, బెంగళూరు, ఢిల్లీ,కలకత్తా రంగం పట్ల యువుత అధికంగా ఆసక్తి చూపడం జరిగిందని దీని కోసమే ప్రత్యేక ఆకర్షణీయమైన వస్త్రాలను అందుబాటులో ఉంచామని నిర్వాహకులు నితన్‌మోర్ తెలిపారు. కాంచీపురం,బెనారస్, లెనిన్, బందానీ, ఖాధీ, సిల్క్ ఆర్గంజా, చిఫాన్ హ్యాండ్లూమ్, శారీస్, డిజైన్డ్ శారీస్, బంగారు అభరణాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. మహిళల అభిరుచికి అనుగుణంగా ప్రత్యేకంగా చేతి వృత్తుల వారిని ప్రోత్సహించేందుకు ఈ ప్రదర్శన నిర్వహించామన్నారు.
నేటి నుంచి వెబ్‌సైట్‌లో
ఏపీఆర్ సెట్ హాల్‌టికెట్లు
* పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పు * ఆచార్య శ్రీనివాసరావు

విశాఖపట్నం, ఆగస్టు 17: రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ, ఎంఫిల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ రీసెర్చ్ టెస్ట్ (ఏపీఆర్ సెట్) ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు నేటి నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్టు ఏపీఆర్ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కే శ్రీనివాసరావు తెలిపారు. పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు చేశామని పేర్కొన్నారు. ఈ నెల 23,24,27,28 తేదీల్లో ఏపీఆర్ సెట్ జరగాల్సి ఉందన్నారు. అయితే ఈ నెల 23న బక్రీద్ సందర్భంగా సెలవు దృష్ట్యా ఇదే పరీక్షను 25న నిర్వహిస్తామన్నారు. మిగిలిన పరీక్షల తేదీల్లో ఎటువంటి మార్పులు ఉండవని తెలిపారు. విద్యార్థులు ఈ మార్పును గమనించి అందుకు అనుగుణంగా పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. పూర్తి సమాచారాన్ని ఏపీఆర్ సెట్ వెబ్‌సైట్ నుంచి పొందాలని సూచించారు.