విశాఖపట్నం

ఆన్‌లైన్ కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 15: మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) పరిధిలో భవన నిర్మాణాల అనుమతులు తీసుకోవాలంటే విశ్వప్రయత్నమే చేయాల్సి వస్తోంది. గతేడాది వరకూ భవన నిర్మాణ అనుమతులన్నీ పట్టణ ప్రణాళిక విభాగం పర్యవేక్షణలో సాగేవి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి భవన నిర్మాణ అనుమతులన్నీ ఆన్‌లైన్‌లోనే ఆమోదించాలని నిర్ణయించడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు ఆమోదించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపకల్పన చేశారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ జివిఎంసికి 200కి పైగా దరఖాస్తులు మాత్రమే అందాయి. ధృవీకరణ పత్రాలు అన్నీ సక్రమంగా ఉంటేనే ఆన్‌లైన్ దరఖాస్తులకు మోక్షం కలుగుతుంది. ప్రస్తుతం ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆమోదం లభించకపోవడంతో భవన యజమనులు అడ్డదార్లను ఆశ్రయిస్తున్నారు. గతంలో నగర పరిధిలో భవన నిర్మాణాలకు సంబంధించి అనుమతులు మంజూరు చేసే విషయంలో నిబంధనల మేరకు ధృవీకరణ పత్రాలు లేనప్పటికీ లోపాయికారీగా అనుమతుల మంజూరు పూర్తయ్యేది. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో సాంకేతికంగా చోటుచేసుకున్న అంశాలు భవన నిర్మాణ అనుమతులకు అవరోధంగా నిలుస్తున్నాయి. ఇదే అంశంపై భవన నిర్మాణ యజమానులు టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులను సంప్రదిస్తే, ఆన్‌లైన్ విధానంలో సాంకేతిక లోపాలను సరిదిద్దిన తర్వాతే అనుమతులు మంజూరవుతాయని స్పష్టం చేస్తున్నారు. దీంతో అనధికార నిర్మాణాలు జోరందుకున్నాయి. నగర పరిధిలోని 72 వార్డులతో పాటు అనకాపల్లి, భీమునిపట్నం మున్సిపాలిటీల పరిధిలో అనధికార నిర్మాణాలను నిలువరించే విషయంలో టౌన్ ప్లానింగ్ విభాగం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగర శివారు వార్డుల్లో అనధికార నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ సిబ్బంది లేమి కారణంగా యంత్రాంగం వౌనం వహిస్తున్నాయి. రెండు విలీన మున్సిపాలిటీలు సహా 72 వార్డులుగా విస్తరించి ఉన్న జివిఎంసిలో గాజువాక, పెందుర్తి, వేపగుంట, మధురవాడ, అనకాపల్లి, భీమునిపట్నం ప్రాంతాల్లో అనధికార నిర్మాణాలు జోరందుకుంటున్నాయి. ఇదిలా ఉండగా టౌన్ ప్లానింగ్‌లోని అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం మరో ముందడుగేసింది. భవన నిర్మాణలను సమీక్షించేందుకు హైపవర్ ప్రొటెక్షన్ మొబైల్ యాప్‌కు రూపకల్పన చేశారు. కింది స్థాయిలో బిల్డింగ్ ఇనస్పెక్టర్ నుంచి సిసిపి వరకూ ట్యాబ్‌లు ఇచ్చి నిర్మాణాలను పరిశీలించనున్నారు. వీరికి లక్ష్యాలను నిర్ధారించి పుఃనపరిశీలన చేయాలని నిర్ణయించారు. ప్రతి బిల్డింగ్ ఇనస్పెక్టర్ తనకు నిర్ధేశించిన పరిధిలో క్షేత్ర పర్యటనలు జరిపి, భవన నిర్మాణాలను చిత్రీకరించాల్సి ఉంది. బిల్డింగ్ ఇనస్పెక్టర్ నివేదికలో 15 శాతం డిసిపిలు, 5 శాతం సిసిపిలు క్రాస్‌చెక్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల అనధికార, అక్రమ నిర్మాణాలను నిరోధించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది.