విశాఖ

మన్యంలో కూంబింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, గూడెంకొత్తవీధి, మే 15: ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు సోమవారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపధ్యంలో పోలీసు బలగాలు భారీ గాలింపు చర్యలు చేపట్టాయి. తనిఖీలు చేపట్టడమే కాకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా మావోయిస్టు ప్రభావిత గ్రామాలలో పోలీసు పార్టీలను రంగంలోకి దింపి మావోల కదలికలను కట్టడి చేసేందుకు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మన్యంలో మావోల కోసం జల్లెడ పడుతుండడంతో ఈసారి బంద్ కు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కొయ్యూరు మండలం మర్రిపాకలు, యు.చీడపాలెంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ కమాండర్ ఆజాద్, డిప్యూటీ కమాండర్ ఆనంద్‌తోపాటు ఒక మహిళా మావోయిస్టు కమల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తూర్పు డివిజన్ కమిటీ సోమవారం బంద్‌కు పిలుపునిచ్చింది.
బంద్ సందర్భంగా మూడు రోజుల నుండి జిల్లా పోలీసు యంత్రాంగం ప్రభుత్వ ఆస్తులకు భద్రత కల్పించడమే కాకుండా మావోల హిట్‌లిస్టులో ఉన్న వారిని మైదాన ప్రాంతాలకు తరలివెళ్ళాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇటీవల మావోలకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్న నేపధ్యంలో ప్రతీకారం కోసం మూకుమ్మడి దాడులకు తెగబడే అవకాశాలు లేకపోలేదని ఆయా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వాహనాల తనిఖీలను పోలీసులు ముమ్మరం చేసి అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. మావోయిస్టుల సానుభూతిపరులుగా ముద్రపడిన వారిపై ప్రత్యేక నిఘాను ఏర్పాటుచేసి వారి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదిలాఉండగా బంద్ పిలుపునిచ్చిన మావోయిస్టులు పోలీసులపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తూ అదును కోసం వేచి చూస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఒడిస్సా, చత్తీస్‌ఘడ్ తదితర ప్రాంతాల నుంచి మావోయిస్టు సభ్యులను విశాఖ మన్యానికి రప్పించినట్టు విశ్వసనీయం గా తెలియవచ్చింది. విశాఖ మన్యంలో మావోయిస్టుల బలం ప్రస్తుతం అం తంతమాత్రంగానే ఉండడంతో తమ బలాన్ని బలగాన్ని పెంచేందుకు పక్క రాష్ట్రాల నుంచి తమ వారిని రప్పించుకుని పోలీసులతో తలపడేందుకు మావోలు సిద్ధమయ్యారని తెలిసింది. దీంతో బంద్ సందర్భంగా హింసాత్మక కార్యకలాపాలకు మావోయిస్టులు ప్రణాళిక రచించుకున్నారని, పరిస్థితులను బట్టి మన్యంలో విధ్వంసకర సంఘటనలకు పాల్పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో వాటికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు వ్యూహాలు పన్నుతున్నారు. ఇప్పటివరకు మావోయిస్టులపై పోలీసులు ఆధిపత్యాన్ని కొనసాగించి భవిష్యత్‌లో మావోలను ముప్పతిప్పలు పెట్టేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధపడుతున్నట్లు స్పష్టమవుతున్నాయి. పట్టు కోసం ఒకరు, ప్రతిష్ట కోసం మరొకరు జరుగుతున్న యుద్ధంతో గిరిజనులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.