విశాఖ

హైవే భూమిలో రోడ్డు నిర్మాణంపై చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, మే 15: జాతీయ రహదారి విస్తరణకు సేకరించిన భూమిలో ఓ ప్రైవేటు కంపెనీ రోడ్లు వేస్తుంటే ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారని మాజీమంత్రి దాడి వీరభద్రరావు ఆరోపించా రు. ఆదివారం స్థానిక విలేఖర్ల సమావేశంలో మాజీమంత్రి దాడి మాట్లాడు తూ ఆవఖండంలో అక్రమ లే-అవుట్లు వేస్తూ రైతుల ప్రయోజనాలను, పట్టణవాసుల ప్రయోజనాలకు భంగం కలిగిం చే చర్యలకు ఆ సంస్థ పాల్పడుతుంటే పాలకులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పంట భూములను నివాసయోగ్యమైన స్థలంగా మార్చుకోవాలనుకుంటే ఎనిమిది కోట్ల రూపాయ లకు పైబడి ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉందన్నారు. అందుకు భిన్నంగా మాస్టర్ ప్లాన్‌లో సవరణలు చేసి నివాస స్థలం కింద ఉత్తర్వులు జారీ చేయించుకుని ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొ త్తాన్ని ఈ సంస్థ యాజమాన్యం ఎగ్గొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
హైవే శాఖ నేషనల్ హైవే నుండి సేకరించిన స్థలాన్ని ఆ సంస్థ తీసుకుని రో డ్డు వేస్తే ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తుందన్నారు. ఆ సంస్థ నేషనల్ హైవే నుండి అక్రమ లే-అవుట్‌లు అప్రోచ్ రోడ్డు వేయడానికి అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. ఈ అనుమతుల ఉ త్తర్వుల కాపీని పత్రికలకు దాడి విడుదల చేశారు. ఉత్తర్వులో తేదీ, సంవత్సరం లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ఉత్తర్వుల కాపీలో నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ సంతకం కింద తేదీ లేకపోవడం విడ్డూరంగా ఉందన్నా రు. ఒక అక్రమ లే-అవుట్ ప్లాన్‌లో ఎన్‌హెచ్-5 స్థలం 500మీటర్ల పొడవుతో, ఐదున్నర మీటర్ల వెడల్పుతో ఎన్‌హె చ్-5కు సమాంతరంగా రోడ్డు చూపించారన్నారు. అగ్రిమెంట్ ఫోర్జరియా, ప్లాన్ ఫోర్జరియా అనేది తేలాల్సి ఉందన్నారు. ఈ విధంగా ఎన్‌హెచ్-5కు చెందిన మూడు వేల చదరపు గజాల స్థలాన్ని ఆ సంస్థ ఆక్రమించిన సంఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని మాజీమంత్రి దాడి డిమాండ్ చేశారు. ఈ అనధికార లే-అవుట్‌లో ఇప్పటికే ప్లాట్ ఉన్నట్లు, లే-అవుట్ అనుమతి పొంది బిల్డింగ్‌లు ఉ న్నట్లు ప్లాన్‌లో చూపించారన్నారు. ఎనిమిది కోట్ల రూపాయల రుసుం చెల్లించి వ్యవసాయ భూమిని నివాస భూమిగా మార్పు చేయడానికి మాస్టర్ ప్లాన్‌లో సవరణలు తెచ్చుకుని ప్రభుత్వ ఉత్తర్వు లు తీసుకోవాలని, ఏ ఉత్తర్వులు లే కుండా లే-అవుట్ అనుమతులు లేకుం డా స్థలాన్ని గ్రౌండ్‌పై పరిశీలన చేయకుండా ఎన్‌హెచ్-5 డైరెక్టర్ అగ్రిమెంట్ అక్రమ ప్లాంట్‌పై సంతకాలు ఏవిధంగా చేశారని దాడి ప్రశ్నించారు. సాగునీటి కాలువలను పంట కాలువల్లో కప్పి ఆవ ఖండంలో అక్రమ లే-అవుట్‌లు వే యగా వీటిపై ఒకవైపు ప్రభుత్వ స్థాయి లో విచారణ జరుగుతుండగా మరోవైపు రోడ్ల నిర్మాణం జరుగుతుండటం అన్యాయమన్నారు.