విశాఖపట్నం

గీతం వర్శిటీ అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరిలోవ, సెప్టెంబర్ 21: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల క్రీడల్లో భాగంగా కబడ్డీ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయం కోడి రామ్మూర్తి ఇండోర్ స్టేడియంలో కబడ్డీ (పురుషుల) పోటీలను గీతం ప్రో వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కే శివరామకృష్ణ ప్రారంభించారు. పోటీల్లో గీతం విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్, సైన్స్, దంత వైద్య కళాశాల, మేనేజ్‌మెంట్ కళాశాల జట్లతో పాటు హైదరాబాద్, బెంగళూరుకు చెందిన గీతం కబడ్డీ జట్లు పాల్గొన్నాయి. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే లక్ష్మీప్రసాద్, సైన్స్ అసిస్టెంట్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే రాజగోపాల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఇన్‌ఛార్జి డైరెక్టర్ కే రామకృష్ణారావు, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, కోచ్‌లు పాల్గొనగా, గీతం విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు ప్రాంగణాల క్రీడాకారులు పాల్గొన్నారు.

వర్జీనియా సిటీలో డాక్టర్ మూర్తికి ఘన స్వాగతం
ఆరిలోవ, సెప్టెంబర్ 21: అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర శాసన మండలి సభ్యుడు, గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు ఎంవీవీఎస్ మూర్తికి వర్జీనియా సిటీలో ఘన స్వాగతం లభించింది. వర్జీనియా సిటీలో ప్రవాస భారతీయులు, గీతం పూర్వ విద్యార్థులు డాక్టర్ మూర్తి, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌లను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. అమెరికాలోని వివిధ సంస్థలకు చెందిన గీతం పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు. అక్టోబర్ 6న అమెరికాలోని మిలిటస్‌లో జరగనున్న గీతం అలూమినీ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (గానం) పూర్వ విద్యార్థుల సమావేశంలో డాక్టర్ మూర్తి ముఖ్యఅతిధిగా పాల్గొననున్నారు.