విశాఖపట్నం

ఓటు విలువలను తల్లిదండ్రులకు తెలియచెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల, సెప్టెంబర్ 24: ప్రజాస్వామ్యంలో ఓటు విలువను విద్యార్థులు వారి తల్లిదండ్రులకు వివరించాలని స్థానిక ప్రభుత్వ హైస్కూల్ ప్రధానోపాద్యాయులు వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులకు ఓటర్లు నమోదు, ఓటు హక్కుపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థినీవిద్యార్థులకు సోమవారం వెంకటేశ్వరరావు, రెవెన్యూ శాఖ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమూర్తి బహుమతులు అందజేసారు. అనంతరం ఓటర్ల నమోదు, ఓటు హక్కుపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తయిన యువతీ యువకులు ఓటు హక్కు నమోదు చేయించుకోవాలన్నారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు గురి కాకూడదన్నారు. నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.