విశాఖపట్నం

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాకవరపాలెం, సెప్టెంబర్ 24: గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని డీ ఎల్‌పీ ఓ శిరీషారాణి కార్యదర్వులను ఆదేశించారు. సోమవారం మండలంలోని తామరం, మాకవరపాలెం గ్రామాల్లో జరుగుతున్న కాలువల్లో పూడిక తీతను తొలగించే పనులను ఆయన పరిశీలించారు. వ్యాధులు ప్రబలుతున్న నేపధ్యంలో ప్రజలు అప్రమ్తంగా ఉండాలన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఎక్కడా చెత్తా చెదారం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే చర్యలు తప్పవని కార్యదర్శులను హెచ్చరించారు. ఆమె వెంట ఇన్‌చార్జ్ ఇ ఓ ఆర్‌డీ శివరామ్ పాల్గొన్నారు.
పేదల కష్టాలు తీర్చేందుకే నవరత్నాలు
* వైసీపీ సమన్వయకర్త గణేష్
నర్సీపట్నం, సెప్టెంబర్ 24: పేద ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకే వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి నవరత్నాలు పథకాన్ని ప్రకటించారని ఆపార్టీ నియోజకవర్గం సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. జగన్ రావాలి - జగన్ కావాలి కార్యక్రమంలో భాగంగా సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో గడగడపకు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా పార్టీ నాయకులు గడపగడపకు వెళ్ళి నవరత్నాల కరపత్రాన్ని అందజేసారు. వార్డు ప్రజలు పలు సమస్యలను గణేష్ దృష్టికి తీసుకువచ్చారు. వైసీపీ అదికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర మూడువేల కిలో మీటర్లకు చేరుకుందన్నారు. పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తెలుసుకున్నారన్నారు. జగన్ సీ ఎం అయితే అందరికీ మంచి రోజులు వస్తాయన్నారు. నవరత్నాలతో ప్రజలు అభివృద్ధి చెందుతారన్నారు. రైతు భరోసాతో ప్రతీ కుటుంబానికి 50 వేలు ఏటా 12,500 రూపాయలు చొప్పున నాలుగేళ్ళ కాలంలో అందజేస్తారన్నారు. డ్వాక్రా మహిళల పొదుపు సంఘాలకు 15వేల కోట్లతో 89 లక్షల మంది మహిళలకు వై ఎస్సార్ ఆసరా పథకంలో బ్యాంకులతో సంబంధం లేకుండా నాలుగు విడతలుగా ఉచితంగా అందజేస్తారన్నారు. అమ్మ ఒడి పథకంలో పేద పిల్లల చదువులకు ప్రతీ కుటుంబానికి ఏడాదికి 20 నుండి 30 వేల రూపాయల వరకు నేరుగా అందజేస్తామన్నారు. ప్రతీ పేదవాడికి ఇళ్ళు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్‌మెంట్ పథకాలను పక్కా అమలు చేయడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈకార్యక్రమంలో నర్సీపట్నం, మాకవరపాలెం మండల పార్టీ అధ్యక్షులు సుర్ల సత్యనారాయణ, రుత్తల సత్యనారాయణ, పట్టణ పార్టీ అధ్యక్షులు కోనేటి రామకృష్ణ, బూత్ కమిటీ మేనేజర్ తమరాన అప్పలనాయుడు, మాతిరెడ్డి సత్యనారాయణ, కౌన్సిలర్ బోడపాటి సుబ్బలక్ష్మి,పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాల బయపురెడ్డి గణమ్మ, గుడివాడ లచ్చబాబు, ఏకారాజుబాబు, ఆరుగుళ్ళ రాజుబాబు తదితరులు పాల్గొన్నారు.