విశాఖపట్నం

విశ్వబ్రాహ్మణులను బీసీ ఎ లో చేర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, సెప్టెంబర్ 24: విశ్వబ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సంఘం జిల్లా అధ్యక్షుడు పెదపాటి గోవిందరావు ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సీబీ ఎం కాంపౌండ్ నుండి ప్రారంభమైన ర్యాలీ కృష్ణాబజార్, అబీద్ సెంటర్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు చేరుకుంది. అక్కడ వారంతా ధర్నా నిర్వహించి అనంతరం ఆర్డీవో వి.విశే్వశ్వరరావుకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేసారు. అక్కడి నుండి ఆర్టీసి కూడలికి చేరుకుని అక్కడ మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేసారు. అనంతరం గోవిందరావు మాట్లాడుతూ లక్షలాదిగా ఉన్న విశ్వబ్రాహ్మణులను గుర్తించడంలో పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. ఐదు ప్రధాన వృత్తుల్లో కొనసాగుతున్న విశ్వబ్రాహ్మణులను బీసీ బీ నుండి బీసీ ఎ లో చేర్చాలని ఆయన డిమాండ్ చేసారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ తమ కులస్తులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఇళ్ళు లేని విశ్వబ్రాహ్మణ పేద కుటుంబాల వారికి ఇంటి స్థలాలు, పక్కా ఇళ్ళు మంజూరు చేయాలని , కార్పెంటర్, స్వర్ణకార వృత్తుల వారికి ఎటువంటి ఆంక్షలు లేకుండా కార్పెంటర్లకు అటవీ అధికారుల నుండి వేధింపులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. శిల్పికారులు, వఢ్రంగులు,కంచర వృత్తిదారులకు సబ్సీడిపై 5హెచ్‌పీ మోటార్లు అందజేసి ఉచితంగా విద్యుత్‌ను ఇచ్చి ఆదుకోవాలన్నారు. బీసీ ఫెడరేషన్‌ను బీసీ కార్పొరేషన్‌గా మార్పు చేసి 15 మంది గ్రూప్ కాకుండా ఐదుగురి సభ్యులతో గ్రూప్ ఏర్పాటు చేసి రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసారు. 50 సంవత్సరాలు దాటిన విశ్వబ్రాహ్మణులకు రెండువేల రూపాయలు ఫించన్ ఇవ్వాలని డిమాండ్ చేసారు. విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి పెదపాటి శాస్ర్తీ మాట్లాడుతూ మండల కేంద్రాల్లో విశ్వబ్రాహ్మణులు చేతివృత్తులు చేసుకునేందుకు , విక్రయించుకునేందుకు వీలుగా దుకాణ సముదాయాలను నిర్మాణం చేయాలన్నారు. విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు. ఈకార్యక్రమంలో సంఘం ప్రతినిధులు జె ఎస్ ఎస్ నాగేశ్వరరావు, సత్యనారాయణ, బాబ్జితదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుండి పెద్ద సంఖ్యలో విశ్వబ్రాహ్మణ కులస్తులు పాల్గొన్నారు. సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి వైసీపీ నియోజకవర్గం సమన్వయకర్త ఉమాశంకర్ గణేష్ సంఘీభావం తెలియజేసారు. విశ్వబ్రాహ్మణుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈసందర్భంగా వారికి హామీ ఇచ్చారు.