విశాఖ

జగన్ పాదయాత్ర చరిత్రలో మైలు రాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకరావుపేట, సెప్టెంబర్ 25: వై ఎస్సార్ సీపీ అధ్యక్షుడు , ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని మాజీ ఎమ్మెల్సీ వై ఎస్సార్ సీపీ నాయకుడు డీవీ సూర్యనారాయణరాజు అన్నారు. మంగళవారం పట్టణంలో పట్టణాధ్యక్షుడు దగ్గుపల్లి సాయిబాబా ఆధ్వర్యంలో జగన్ ఫ్రజా సంకల్ప యాత్ర మూడువేల కిలో మీటర్లకు చేరుకున్న సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకున్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న వై ఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది నవంబర్ 6 న ఇడుపుల పాయలో వై ఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు. పది నెలల 20 రోజుల్లో మూడువేల మైలు రాయిని దాటారన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ జగన్ చేస్తున్న పాదయాత్ర రికార్డు అన్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం రైతులు కుదేలు చేసేలా వ్యహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. 2019లో తాము అధికారంలోకి వస్తాయని , నిరుపేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకునేందుకు నవరత్న పథకాలు ఎంతో దోహదపడతాయన్నారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గం సమన్వయకర్త చిక్కాల రామారావు, మండలాధ్యక్షుడు ధనిశెట్టి బాబూరావు , రాష్ట్ర బీసీసెల్ ప్రధాన కార్యదర్శి చోడిపల్లి శ్రీను, గూటూరు శ్రీను, ఎ. ప్రసాద్, ఎన్. అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.
ఉపకులాల బహిరంగ సభను విజయవంతం చేయండి
పాయకరావుపేట, సెప్టెంబర్ 25: ఈనెల 30న అడ్డురోడ్డులో జరిగే గీత కార్మికుల ఉప కులాల భారీ బహిరంగ సభకు తరలి రావాలని రాష్ట్ర బీసీ ఉద్యమ నాయకులు పజ్జం శెట్టి వెంకటేశ్వరరావు కోరారు. మంగళవారం పాయకరావుపేటలో గీత కార్మికులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గీత కార్మికులు 90 లక్షల మంది ఉన్నారన్నారు. యలమంచిలి, భీమిలి, విశాఖ దక్షిణ నియోజకవర్గాల్లో తమ కులాల వారికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్నారు. పలు రుణాల్లో అన్యాయం జరుగుతుందన్నారు. కులవృత్తులు అంతరించిపోతున్నందున గీత కార్మికులు బ్రాందీ షాపుల లైసెన్స్‌ల్లో 50 శాతం కేటాయించాలన్నారు. ప్రమాదశాత్తు మరణిస్తే 10 లక్షలు ఇవ్వాలన్నారు. ఈకార్యక్రమంలో పి.సన్యాసిరావు , జి.రమణ, జి.శ్రీను, ఎ. అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే జగన్ సంకల్పయాత్ర
*వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలుపుఖాయం
అనకాపల్లి టౌన్, సెప్టెంబర్ 24: రాష్టవ్య్రాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకోవడానికే వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర నిర్వహిస్తున్నారని అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగుడివాడ అమర్‌నాధ్ అన్నారు. వైకాపా అధినేత వైఎస్ జగన్ నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్ర 270 రోజులకు మూడువేల కిలోమీటర్లు పూర్తిచేసిన సందర్బంగా వైకాపా పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు అధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సంఘీభావ ర్యాలీలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ముందుగా జానీ కార్యాలయం నుండి పార్టీ నాయుకులు, కార్యకర్తలుతో ర్యాలీగా బయలుదేరి మెయిన్ రోడ్డు మీదుగా చిన్న నాలుగురోడ్లు జంక్షన్‌కు చేరుకుంది. అక్కడ ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళు ఆర్పించారు. ఈ సందర్బంగా అమర్‌నాధ్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తుడడంతో రాష్ట్రంలో ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ జగన్ గ్రహించి వారి సమస్యలను తెలుసుకోవడానికి ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనతో విసుగుచెందిన రాష్ట్ర ప్రజలు జగన్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని జగన్ పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు చూపిస్తున్న అభిమానం రుజువుచేస్తుందన్నారు. రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైకాపాగెలుపు ఖాయమని, మళ్ళీ రాజన్న రాజ్యం వస్తుందన్నారు. పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు మాట్లాడుతూ అనకాపల్లిలో జరిగిన వైఎస్ జగన్ సభలోఇచ్చిన హామీలు అన్ని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే అమలుచేస్తారన్నారు. అనకాపల్లి ఎమ్మెల్యేగా గుడివాడ అమర్‌నాధ్‌ను గెలిపించి జగన్‌కు బహుమతిగా ఇవ్వడానికి ప్రతీ కార్యకర్తకృషి చేయాలని పిలుపునిచ్చారు. పట్టణ విభాగ అధ్యక్షులు జాజుల రమేష్ మాట్లాడుతూ జగన్ రూపొందించిన నవరత్నాల పథకాలు బడుగు బలహీన వర్గాల ప్రజలకు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో కొణతాల మొరళీకృష్ణ, అనకాపల్లి కశింకోట మండల పార్టీ అధ్యక్షులు గొర్లి సూరిబాబు, గొల్లవెల్లి శ్రీనివాసరావు, ఏవి రత్నకుమారి, పట్టణ అధికార ప్రతినిధి ఆళ్ళ నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి కుండల రామకృష్ణ, బీశెట్టి జగన్, పి మొరళి పార్టీ నాయులు, కార్యకర్తలు పాల్గొన్నారు.