విశాఖపట్నం

స్మార్ట్ స్టేషన్‌లో బయో టాయ్‌లెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 16: విశాఖ రైల్వేస్టేషన్ స్మార్ట్ స్టేషన్‌గా అభివృద్ధి చెందుతోంది. పచ్చదనం-పరిశుభ్రత, స్వచ్ఛ్భారత్, స్వచ్ఛ రైల్వేస్టేషన్ అనే నినాదాలతో గత ఏడాది కాలంగా విశాఖ రైల్వేస్టేషన్‌ను అన్నివిధాలా అభివృద్ధి చేస్తోన్న వాల్తేరు డివిజన్ అధికారులు ఇపుడు స్టేషన్ సుందరీకరణపై దృష్టిపెట్టారు. ఇందుకోసం కొన్ని కోచ్‌ల్లో బయో-టాయ్‌లాట్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. యుద్దప్రాతిపదికన వీటి ఏర్పాటు జరుగుతోంది. ఇప్పటికే ‘గ్రీన్ ట్రైన్స్’ పేరిట 259 కోచ్‌ల్లో బయో టాయ్‌లెట్లను ఏర్పాటు చేయగలిగారు. అలాగే మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ళలకు దీనిని విస్తరించాలని నిర్ణయించారు. దీనివల్ల ఎప్పటి మాదిరి రైల్వేట్రాక్, పట్టాలు అపరిశుభ్రం కావడం, దుర్వాసన వంటి వాటికి అవకాశం ఉండదు. పర్యావరణ పరిరక్షణకు బయోటాయ్‌లెట్స్ దోహదపడతాయి. విశాఖ రైల్వేస్టేషన్ మీదుగా ప్రతిరోజు 130 రైళ్ళకు పైగానే నడుస్తున్నాయి. ఇందులో ఎక్స్‌ప్రెస్‌లు 70, మరో 20 సూపర్‌పాస్ట్‌లు, ఇంకో 40 వరకు పాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. ఇవికాకుండా పండుగలు, వేసవి సీజన్లలో మరికొన్ని ప్రత్యేక రైళ్ళు నడుస్తుంటాయి. ఈ విధంగా 24 గంటలూ రైళ్ళతోను, నిత్యం ప్రయాణికుల రద్దీతో కనిపించే విశాఖ రైల్వేస్టేషన్‌లో పరిశుభ్రత అనేది సాధ్యపడేది కాదనే భావన అందరిలో ఉండేది. అలాగే పారిశుద్ధ్యం నిర్వహణ వాల్తేరు డివిజన్‌కు సాధ్యపడేది కాదు. అటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ్భారత్‌లో భాగంగా డివిజన్ అధికారులు దీనిని అవకాశంగా చేసుకున్నారు. ఇందులోభాగంగా గత ఏడాది కాలంగా డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రలేఖముఖర్జీ చొరవ చూపి ‘స్వచ్ఛ్భారత్-స్వచ్ఛ స్టేషన్’ పేరిట రైల్వే ఉద్యోగులను భాగస్వాములు చేస్తూ వారంలో రెండు రోజులపాటు స్టేషన్ శుభ్రత, చెత్తాచెదారం తొలగింపు, రైల్వేట్రాక్, ప్లాట్‌ఫారాలు, కోచ్‌లు సైతం నీటితో శుభ్రపర్చడం వంటివి విస్తృతపర్చారు. దీనివల్ల చాలామటుకు పరిశుభ్రత సాధ్యపడింది. అలాగే పారిశుద్ధ్య సిబ్బందితోపాటు నిరంతరం పచ్చదనం-పరిశుభ్రతపైనే దృష్టిపెట్టే విధంగా సంత్ నిరంకారీ ఛారిటబుల్ ఫౌండేషన్, రోటరీక్లబ్ వంటి స్వచ్ఛంధ సంస్థలరు, విద్యార్ధులు, రైల్వే స్కౌట్స్ అండ్ గైడ్స్, సివిల్ డిఫెన్స్, రైల్వే కుటుంబాలు, ఆధికారులు, సిబ్బంది ఇందులో భాగస్వాములవుతున్నారు. స్టేషన్ పరిశుభ్రతతోపాటు ఇటువంటి బయో టాయ్‌లెట్‌ల వలన రైల్వేట్రాక్‌ల అపరిశుభ్రతకు అవకాశం ఉండదు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
అనంతగిరి, మే 16: నిమ్మలపాడు రహదారిలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. మండలంలోని పులుసుమామిడి నుంచి అనంతగిరి వారపు సంతకు అధిక లోడుతో వస్తున్న ఆటోను నిమ్మలపాడు కాల్షియేట్ క్వారీకి చెందిన లారీ డముకు సమీపంలో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో పక్కన ని ల్చొని ఉన్న చింతా వెంకటేష్ (48) అనే గిరిజనుడి తలపై నుంచి లారీ వెళ్లిపోవడంతో అతను అక్కడికక్కడే మృతి చె ందాడు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం అరకు పి.హెచ్.సి.కు తరలించారు. ఇదే ఘటనలో దేవపర్తి లచ్చన్న అనే గిరిజనుడి రెండు కాళ్లపై నుంచి లారీ వెళ్లిపోవడంతో అతని కాళ్లు నుజ్జునుజ్జుకావడంతోపాటు త లకు తీవ్రగాయమైంది. 108 అత్యవసర వాహన సహాయ ం తో లచ్చన్నను విశాఖ కె.జి.హెచ్‌కు తరలించారు. మార్గమ ధ్యంలో ఆయన మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ బొడ్డవరానికి చెందిన వర్మ అనే వ్యక్తిగా గుర్తించారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్తాపు చేస్తున్నారు.