విశాఖపట్నం

ఆదాయం, ఆరోగ్యం ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: సముద్ర ఉత్పత్తులను శుద్ధి చేయడం, వాటిని నిల్వ చేయడం ద్వారా ఆదాయం పొందే అవకాశాలు మెరుగుపరిచే దిశగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (సిఐఎఫ్‌టీ) సంయుక్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. దేశంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు రూ.40వేల కోట్లు కాగా, దీనిలో ఏపీ వాటా రూ.13వేల కోట్లకు పైనే. అగ్రస్థానంలో ఉన్న ఏపీలో మరింతగా ఈ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అటు ఆదాయంతో పాటు ఇటు మత్స్యకారులు, ఇతర వర్గాలకు ఉపాధి కల్పించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు అమలు చేస్తున్నాయి. చేపలు, రొయ్యలు, తదితర సముద్ర ఉత్పత్తులను సేకరించి, వాటిని శుద్ధి చేసి ఎగుమతి లేదా మార్కెటింగ్‌కు సిద్ధం చేసేందుకు ఐసీఏఆర్ - సిఐఎఫ్‌టీ పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. అత్యాధుక సాంకేతిక విధానాలు అవలంబిస్తూ సముద్ర ఉత్పత్తులను శుద్ధి చేయడం కోసం పలు శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారు. శుద్ధి చేసిన సముద్ర ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా విదేశీ మారకద్రవ్యం చేసే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో విదేశాలకు ఎగుమతి చేయలేని ఉత్పత్తులను దేశీయంగా విక్రయించేందుకు అనువుగా తీర్చిదిద్దుకునేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగానే ‘రెడీ టూ ఈట్’ పేరిట చేప, రొయ్య తదితర సముద్ర ఉత్పత్తులను శుద్ధి చేసి విక్రయానికి సిద్ధం చేస్తున్నారు. దీనికోసం ఐసీఏఆర్ - సిఐఎఫ్‌టీ సంయుక్తంగా శిక్షణ కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సంబంధించి శిక్షణ కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహించారు. సముద్ర ఉత్పత్తులతో రెడీ టూ కుక్, రెడీ టూ ఈట్ ఆహార పదార్ధాల తయారీలో అభ్యర్థులకు శిక్షణ నిచ్చారు. ఐసీఎఆర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ మధుసూధన్ రావు, సైంటిస్ట్ విజి, జేస్మి తదితరులు శిక్షణ శిబిరంలో అభ్యర్థులకు పలు అంశాలను విశదీకరించారు.