విశాఖపట్నం

కర్మయోగి దీనదయాళ్ ఉపాధ్యాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: అంత్యోదయ సిద్ధాంతకర్త, కర్మయోగి, స్ఫూర్తి ప్రధాత పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఉదయం జరిగాయి. నగర పార్టీ అధ్యక్షుడు ఎం నాగేంద్ర సారధ్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ సాధారణ కుటుంబంలో జన్మించిన దీనదయాళ్ ఉపాధ్యాయ ఉన్నత స్థితి ఎదిగేందుకు ఎంతో శ్రమించారన్నారు. భారతీయ జనతాపార్టీకి సిద్ధాంత కర్తగా ఆయన్ను కొనియాడారు. సంక్షేమ ఫలాలు చిట్టచివరి వ్యక్తికీ అందాలని ఆకాక్షించారని, అందులో భాగంగానే అంత్యోదయ సిద్ధాంతాన్ని రూపొందించారన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు పీవీ చలపతిరావు మాట్లాడుతూ పాత్రికేయునిగా దీనదయాళ్ ఉపాధ్యాయ అన్ని వర్గాల స్థితిగతులను సమదృష్టితో పరిశీలించేవారన్నారు. విశాఖ పర్యటనలో ఆయనతో పాటు తాను పాల్గొనడం తన అదృష్టంగా పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ విశ్వనాధరాజు మాట్లాడుతూ దివంగత వాజ్‌పేరుూ, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ వంటి మహానాయకులకు స్ఫూర్తి దీనదయాళ్ ఉపాధ్యాయ వంటి వారేనన్నారు. రాష్ట్రీ స్వయం సేవక్ సంఘ్‌కు రాజ్యాంగాన్ని సృష్టించారన్నారు. కార్యక్రమానికి నాగేంద్ర సారధ్యం వహించగా, సుహాసిని ఆనంద్, ఎస్‌వీఎస్ ప్రకాశరెడ్డి, నరేంద్ర ప్రకాష్, టీ సుబ్బరామిరెడ్డి, పీవీ నారాయణ, నగర పదాధికారులు పాల్గొన్నారు.