విశాఖపట్నం

ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌కు సరిపడేలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత నిస్తూ, క్రీడాకారులకు అవసరమైన వౌలిక వసతులు, క్రీడా ప్రాంగణాలకు హంగులు కల్పించేందుకు వాల్తేరు డివిజన్ అధికారులు ముందుకు వెళ్తున్నారు. క్రికెట్, వాలీబాల్, ఫుట్‌బాల్, కబడ్డీ వంటి క్రీడల్లో వాల్తేరు డివిజన్ క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరుస్తూనే ఉన్నారు. క్రీడాకారులకు మరింత మెరుగైన వసతులు కల్పించే దాదాపు రూ.3 కోట్లతో అదనపు హంగులు కల్పిస్తున్నారు. ప్రధాన కేంద్రంలో గల రైల్వే స్టేడియంలో రంజీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు వీలుగా అవకాశాలు కల్పిస్తున్నారు. మైదానం చుట్టూ కంచె నిర్మాణం సహా, అద్దాల పెవిలియన్ వంటి సదుపాయాలు కొత్తగా చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా మరో రెండు టెన్నిస్ కోర్టులు, మరో వాలీబాల్ కోర్టు, బాల్ బ్యాడ్‌మింటన్ కోర్టు, కబడ్డీ ప్రాంగణం నిర్మిస్తున్నారు. క్రీడాకారులకు వసతి అందుబాటులో ఉండేలా అన్ని హంగులతో కూడిన డార్మెటరీ నిర్మాణం చేపడుతున్నారు. ఇండోర్ స్టేడియంను ఆనుకుని తాటిచెట్లపాలెం రహదారిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సరికొత్త రూపు సంతరించుకుంటోంది. నిరుపయోగంగా ఉన్న ఈ స్థలాన్ని ఫుట్‌బాల్ మైదానంగా రైల్వే యంత్రాంగం తీర్చిదిద్దుతోంది. తొలి సారిగా వాల్తేరు డివిజన్ పరిధిలో ఫుట్‌బాల్ మైదానం అందుబాటులోకి రానుంది. ఫుట్ మైదానంతో పాటు 400 మీటర్ల సింథటిక్ రన్నింగ్ ట్రాక్ నిర్మాణం జరుగుతోంది.
రంజీ లేదా ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ నిర్వహించాలి
రైల్వే స్టేడియాన్ని రంజీ లేదా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించేందుకు వీలుగా సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో రంజీ సీజన్ ప్రారంభం అవుతుంది. అప్పటికి స్టేడియాన్ని మ్యాచ్ నిర్వహణకు సిద్ధం చేసేలా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మైదానం 70 మీటర్ల బౌండరీ లైన్‌గా తీర్చిదిద్దుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే నీరు నిలిచి మ్యాచ్‌లకు అంతరాయం కలగకుండా పూర్తిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంను అందుబాటులోకి తెస్తున్నారు. వర్షంతో గ్రౌండ్ నిండిపోతే గంటలో ఆరిపోయేలా డ్రై యంత్రాలను అందుబాటులోకి తెస్తున్నారు.