విశాఖపట్నం

సమీకృత క్రీడా గ్రామంపై ప్రతిపాదనలు సమర్పించిన ఆర్కిటెక్ట్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 16: నగరానికి సమీపంలో గండిగుండం వద్ద నిర్మించనున్న సమీకృత క్రీడా గ్రామానికి సంబంధించి ప్రతిపాదనలను విశాఖా నగరాభివృద్ధి సంస్థ (వుడా)కు ఆర్కిటెక్ట్‌లు సోమవారం అందచేశారు. దాదాపు 80 ఎకరాల్లో వివిధ క్రీడలను నిర్వహించేందుకు వీలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాన్ని నిర్మించేందుకు ప్రతిపాదించడం తెలిసిందే. వివిధ ప్రాంతాలకు చెందిన ఆర్కిటెక్ట్‌లు సోమవారం తమ ప్రతిపాదనలను వుడా వీసీ బాబూరావు నాయుడుకు అందచేశారు. 8 సంస్థలు తమ ప్రతిపాదనలను అందచేశాయి. ఈ సమావేశంలో అదనపు వీసీ కె.రమేష్, కార్యదర్శి ఎ.శ్రీనివాస్, ఎస్‌ఇ ఎం.అప్పన్న, ఇన్‌చార్జి చీఫ్ అర్బన్ ప్లానర్ రామతీర్థ, తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదాపై ఎంపి హరిబాబును
అడ్డుకున్న విద్యార్థి సంఘాలు
అనకాపల్లి(నెహ్రూచౌక్), మే 16: ప్ర త్యేక హోదా కల్పించాలంటూ విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబును అనకాపల్లిలో సోమవారం స్థానిక గవరపాలెం మళ్ల జగన్నాథం కల్యాణమండపం వద్ద అడ్డుకున్నారు. ఎంపీ హరిబాబు మళ్ల జగన్నాథం కల్యాణమండపంలో భారతీ య జనతాపార్టీ కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంలో విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాపై ఆయనను నిలదీశారు. ఎన్నికల ముందు బిజెపి ప్రత్యేక హోదాను సాధించి తీరుతామ ని ప్రజలను నమ్మించి ఇప్పుడు ప్రత్యేక హోదాకోసం స్పందించక పోవడంలో ఆంతర్యమేమిటని విద్యార్థి సంఘాలు ఆయనను నిలదీశారు. ఇచ్చిన మాటను వెనక్కు తీసుకోవాలని ఎంపి హరిబాబు కు వ్యతిరేకంగా ఫ్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. దీంతో సమీపంలో ఉన్న పోలీసులు సిబ్బంది వారిని పక్కకు నెట్టివేసి వారి చేతిలో ఉన్న ప్లకార్డులను చించివేసి వారిని అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు డి.గోపి, ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్ కనిశెట్టి సురేష్‌బాబు మాట్లాడు తూ అక్రమంగా అరెస్టులు చేయడం అ న్యాయమన్నారు.
ప్రత్యేక హోదా కల్పించినట్లయితే నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కలుగుతుందని వారన్నారు. ప్రత్యేక హోదా వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 90శాతం గ్రాంట్ల రూపంలో వస్తాయని, దీంతో పరిశ్రమ లు నెలకొని రాష్ట్రం అన్నివిధాలుగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో ప్రజాచైతన్య వేదిక అధ్యక్షుడు పెంటకోట రాజు, తుమ్మపా ల ఎంపిటిసి చదరం నాగేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు.