క్రైమ్/లీగల్

గిరిజనుడి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతగిరి, సెప్టెంబర్ 27: మండలంలోని గుమ్మ పంచాయతీ కరకవలస గ్రామానికి చెందిన గిరిజనుడు బుధవారం రాత్రి హత్యకు గురయ్యాడు. కరకవలస గ్రామానికి చెందిన బికారి (50) అనే గిరిజనుడు బుధవారం డుముకు వారపు సంతకు వెళ్లి తన గ్రామానికి వెళుతుండగా కరకవలస గ్రామ సమీపాన గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డిలితో నరికి హతమార్చారు. అయితే ఈ సంఘటనకు ఎవరు పాల్పడ్డారు, ఎందుకు హత్య చేసారన్నది ఇంకా తెలియరాలేదు. హత్య విషయమై తెలుసుకున్న అరకులోయ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకునాయుడు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.