విశాఖ

ప్రమాదాల నివారణకు హైవేలపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునగపాక, మే 17: తరచూ ప్రమాదాలు జరిగే జాతీయ రహదారుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెడతామని ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్ సందర్శించడానికి వచ్చిన సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఇటీవల నేషనల్ హైవేలపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అన్ని పోలీస్ స్టేషన్లు సందర్శించి పూర్తిస్థాయిలో అవగాహన వచ్చిన తరువాత శాంతిభద్రతలపై ఆదేశాలు ఉంటాయన్నారు. అనకాపల్లి -అచ్యుతాపురం రోడ్డు అధ్వాన్నంగా ఉండడం వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అచ్యుతాపురం బ్రాండిక్స్ కంపెనీలో పనిచేసి రాత్రిపూట ఇళ్లకు చేరే మహిళలకు రక్షణగా గస్తీ పెంచుతామన్నారు. స్థానిక పోలీసుల పనితీరు బాగుందన్నారు. ఎస్పీ వెంట అనకాపల్లి రూరల్ సిఐ ప్రసాదరావు పాల్గొన్నారు.