విశాఖపట్నం

విజృంభిస్తున్న స్వైన్‌ప్లూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, అక్టోబర్ 14: జిల్లాలో స్వైన్‌ప్లూ వ్యాధి విజృంభిస్తుంది. నగరంతో పాటు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా విశాఖకు స్వైన్‌ప్లూ లక్షణాలతో వైద్య సేవలకు తరలిరావడంతో రోజురోజుకి వాటి సంఖ్య కూడా పెరుగుతుంది. అంతేకాకుండా మరోవైపు అనుమానిత కేసుల సంఖ్య కూడా అదే సంఖ్యలో ఉంది. ఇప్పటికే జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. అనుమానిత కేసులు కూడా ఇదే స్థాయిలో ఉన్నాయి. ఆదివారం టీబీ ఆసుపత్రిలో చికిత్స పోందుతూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన పి.సంతోషి (28) స్వైన్‌ప్లూతో వైద్యసేవలు పోందుతూ మరణించింది. అయితే గత నెల రోజులుగా రాష్ట్రంలోని ఎన్నూడూ లేని విధంగా డెంగ్యూ, మలేరియా వ్యాధుల తీవ్రత అధికంగా ఉండటంతో అధికార యంత్రాంగం నివారణ చర్యలు చేపట్టడంతో తగ్గుముఖం పట్టిన సమయంలో తాజాగా స్వైన్‌ప్లూ వ్యాధి తీవ్రత పెరుగుతూ ఉంది. కేవలం ఆరోగ్యశాఖ అధికారులు కనీసం దృష్టి సారించకపోవడంతోనే జిల్లా వ్యాప్తంగా వ్యాధి తీవ్రత పెరుగుతుందని చెప్పవచ్చు. దీనితో పాటు జిల్లా వ్యాప్తంగా పారిశుధ్య కార్మికులంతా గత 11 రోజులుగా సమ్మె చేపట్టడంతో నగరంతో పాటు శివారు ప్రాంతాలన్ని మురికికుపాలుగా తయారైయ్యాయి. అయితే కేవలం అధికారులు స్వైన్‌ప్లూ రోగి ఉన్న ప్రాంతాల్లో మాత్రమే సర్వెలెన్స్ చేపడుతున్నారే తప్ప మిగిలిన ప్రాంతాల్లో కనీసం దృష్టి సారించడం లేదు. వ్యాధి తీవ్రత మరింతగా పెరగక ముందే అధికారులు యుద్దప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
* వాతావరణంలో మార్పులే కారణం
స్వైన్‌ప్లూ వ్యాధి తీవ్రత మరింతగా పెరగడానికి వాతావరణంలో మార్పులే కారణమని వైద్యాధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా నగరంలోని పారిశుధ్య పరిస్థితులు, పందుల సంచారం ఇతర సమస్యలను అధికారులు దృష్టిసారించి ప్రత్యేక శ్రద్ద చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే గత రెండు సంవత్సరాలుగా విశాఖ జిల్లాలో స్వైన్‌ప్లూ వ్యాధి క్రమేపీ పెరుగుతూ రావడంతో పాటు మరణాల సంఖ్య అధికంగానే ఉంది.
* పడకేసిన ప్రచార విభాగం
వైద్య ఆరోగ్యశాఖలోని నూతన వ్యాధులు, స్వైన్‌ప్లూ తదితర వాటిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించేందుకు ఏర్పాటు చేసిన డెమో(ప్రచార విభాగం) పూర్తి స్థాయిలో పడకేసింది. కనీసం ఓ ఎక్కరికి వ్యాధులపై అవగాహన కల్పించిన సందర్భాలు లేవు. వాస్తవానికి చెప్పలంటే డెమో విభాగం అన్ని పీహెచ్‌సీలకు కరపత్రాలు, ఇతర పోస్టర్లును తయారు చేసి వాటిని సకాలంలో పంపిణీ చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకొవడం లేదు. కేవలం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా డెమో విభాగం పడకేసింది. ఈ విభాగాన్ని ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో ప్రచార సేవలు అందేలా కలెక్టర్, డి ఎంహెచ్‌వో ఇతర అధికారులు దృష్టిసారించాల్సి ఉంది. కేవలం నూతన ఆసుపత్రులు అనుమతులు, పాత ఆసుపత్రులకు సంబంధించిన ఫైళ్లు తదితర వాటికే పరిమితమవుతూ కాలం గడపుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఇప్పటికే ఈ విభాగంపై అనేక ఫిర్యాదులు వస్తున్నా ఏమాత్రం పట్టించుకనే నాథుడే లేకుండా పోయారు. వ్యాధుల తీవ్రత ఉన్న సందర్భల్లోనైనా ఆయా విభాగ అధికారులు బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉంది.
* నివారణ చర్యలు తీసుకుంటున్నాం:
నోడల్ ఆఫీసర్ కళ్యాణ్‌ప్రసాద్
జిల్లాలో స్వైన్‌ప్లూ వ్యాధి నివారణకు ప్రత్యేక నివారణ చర్యలు చేపడుతున్నామని జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణ్‌ప్రసాద్ తెలిపారు. అనుమానిత కేసుల సంఖ్య పెరుగుతున్నారని వారికి కేజీహెచ్‌లో ఉంచి రక్తనమూనాలను సేకరించి వైరాలజీ ల్యాబ్‌కు పంపుతున్నామని,నిర్థారణయిన తరువాత టీబీ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నివారణ చర్యలు తీసుకుంటున్నామన్నారు.