విశాఖపట్నం

జీవో27 సవరణలో ప్రత్యేక చొరవ చూపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, అక్టోబర్ 14: వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, జిల్లా కమిటీ ద్వారా ఎంపికైన ఉద్యోగులకు నష్టం కలిగిస్తున్న జీవో నెంబర్ 27ను సవరణ చేసే విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొవాలని తెలుగునాడు మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు మినిమమ్ వేజ్స్ బోర్డు చైర్మన్ ఎ. రామ్మోహన్‌రావును కోరారు. నగర పర్యటనకు వచ్చిన ఆయనను ఆదివారం నగరంలో ఓ హోటల్‌లో టీ ఎన్‌టీయుసీ యూనియన్ నాయకులు కలసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు చల్లా చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసే విధంగా చర్యలు తీసుకొవాలని, రిక్రూట్‌మెంట్ బోర్డుని ఏర్పాటు చేసి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. ప్రతీ సంవత్సరంలో ఖాళీలు ఆధారంగా రెండు సార్లు ప్రతీ క్యాడర్‌లో పదోన్నతులు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయిస్‌కి చాలా కాలంగా అమల్లో ఉన్న డీ ఏ, హెచ్ ఆర్ ఓ విధానం కొనసాగించాలిని, జిల్లా బోర్డు ద్వారా ఎంపికైన వారికి 2004 నుంచి ఈ విధానం అమల్లో ఉందన్నారు. ఎన్నికల హమీలలో ఇచ్చిన విధంగా ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల హమీలను నేరవేర్చాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసిన వారికి మినిమమ్ జీతాలను అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆసుపత్రుల్లో కీలకంగా ఉన్న స్ట్ఫానర్సులకు నెలకు ఇరవై వేలు అందే ప్రత్యేక శ్రద్ద తీసుకొవాలన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన చైర్మన్ రామ్మోహన్‌రావు మాట్లాడుతూ దీనిపై ప్రభుత్వ అధికారులతో చర్చించి వారికి న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రీనివాసాచారి, పట్నాయక్, తదితరులు పాల్గొన్నారు.

పద్మాశాలీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి
జగదాంబ, అక్టోబర్ 14: అన్ని వర్గాల ప్రజలతో పాటు సమాజంలో అత్యధిక ఓటు బ్యాంక్ కలిగిన పద్మాశాలీలకు వచ్చే ఎన్నికలల్లో రాజకీయ ప్రాధాన్యత కల్పించి, వృత్తి పరంగా మరింత ప్రోత్సహించాలని పద్మాశాలి ఆత్మీయ సేవా సంఘం నాయకులు బేతా సుర్యప్రకాష్, కొప్పల రమేష్ అన్నారు. నగరంలోని బురుజుపేటలోని పద్మాశాలి ఆత్మీయసేవా సంఘం నూతన కార్యాలయాన్ని ఆదివారం అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మాశాలిల మధ్య ఐక్యత కోసం నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసి వారిని మరింత ప్రోత్సహించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సుమారు రెండు లక్షల ఉన్న పద్మాశాలీల ఓట్టు ఉన్న మమిల్ని కేవలం అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్‌గానే చూస్తున్నాయే తప్ప ప్రాధాన్యత ఇవ్వడం లేదున్నారు. పార్టీలకు అతీతంగా పద్మాశాలీలకు వృత్తి పరంగా ఆదుకొవాలన్నారు. చేనత వస్త్రాల తయారీ తదితర వాటిపై రుణాలును అందించి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పద్మాశాలీ నాయకులు తుమ్మ సుర్యప్రకాష్, రామారావు, ఇంధన భధ్రరావు, ఇమంది రాంబాబు,సాయిన రామకృష్ణ, కొప్పల ప్రభావతి, ఆలేటి హేమవతి వివిధ సంస్థల ప్రతినిధుల పాల్గొన్నారు.

బాలల సేవలకు సమాజం ప్రాధాన్యతనివ్వాలి
* రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు అప్పారావు
జగదాంబ, అక్టోబర్ 14: బాలల సేవలకు సమాజం ప్రాధాన్యత్యను ఇవ్వాలసిన అవశ్యకత ఎంతైనా ఉందని ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు కె.అప్పారావు అన్నారు. చైల్డ్‌రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం, మానవసేవే మాధవసేవ అసోసియేషన్, నగరానికి చెందిన విద్యావేత్తలు ఈ.్భస్కర్‌రావు, సునీత దంపతుల ఆర్థిక సహాయంతో నగరంలోని ఆదివారం వెంకోజిపాలానికి శ్రీరామానందశ్రమంలో పేద, అనాథ విద్యార్థులకు నిత్యావసర వస్తువలను పంపీణి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అప్పారావు మాట్లాడుతూ బాలలకు అందించే సేవను భగవంతుడు తప్పక గుర్తిసారన్నారు. మరింత మంది ప్రోత్సహకాలు అందిస్తే అనాథులు, పేద విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించవచ్చునన్నారు. విశాఖతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బాలల హక్కులు, వారి పరిరక్షణ కోసం సీఆర్‌ఫీఎఫ్ బృహత్తర సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. చైల్డ్‌రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గొండు సీతారాం మాట్లాడుతూ అనాథ బాలబాలికలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే ఇటువంటి సేవా కార్యాక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీ ఆర్‌ఫీ ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు వి.శకుంతలదేవి, కె. ఎల్లయ్య, పి,శేఖర్, సంస్థ ప్రతినిధులు సనపల రామన్న, ఉపాధ్యక్షుడు భానుప్రకాష్, ఆశ్రమం నిర్వాహకులు పరిపూర్ణనంద స్వామి, తదితరులు పాల్గొన్నారు.