విశాఖపట్నం

ఇప్పటికి ఇంతే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 14: లివిటిపుట్టు ఘటనకు కుట్రపన్నిన నలుగురిని అరెస్ట్ చేసి, ఈ కుట్రలో పాల్గొన్న ఓ మహిళా మావోయిస్ట్‌లు హతమార్చి ఈ కేసులో వీడిన మిస్టరీ ఇప్పటికి ఇంతే అని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారిగా నియమించిన డీసీపీ ఫకీరప్ప, ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ఆదివారం ఇక్కడ విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రెండేళ్లుగా మావోయిస్ట్‌లు ఏఓబీలో ఉనికి కోల్పోయి, పెద్ద ఘటనతో మళ్లీ పట్టు సాధించాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే కిడారిని, మాజీ ఎమ్మెల్యే సివేరిని హతమార్చినట్టు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. మావోయిస్ట్‌ల ఉనికి కోసమే అయితే, కిడారి, సివేరిని హతమార్చిన తరువాత అందుకు బాధ్యులం తామేనంటూ ప్రకటించేవారు. ఇప్పటి వరకూ మావోయిస్ట్‌ల నుంచి ఎటువంటి లేఖ విడుదల కాకపోవడం వెనుక ఆంతర్యమేంటో అర్థం కావడం లేదు. ఒకవేళ మావోయిస్ట్‌లు తమ ఉనికి కోసమో, ప్రతీకారం కోసమో, లేక ప్రజా కోర్టులో ప్రజా ప్రతినిధులను శిక్షించడం కోసమో ఇటువంటి ఘటనలకు పాల్పడి ఉంటే, వారు తమ సొంత నిఘా వ్యవస్థను వినియోగించుకునేవారు. ఇలా రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వారిపై ఆధారపడకపోవచ్చని తెలుస్తోంది. కోరాపుట్ నుంచి మావోయిస్ట్‌లను పిలిపించి, వీరిద్దరి హత్య చేయించిన కుట్రదారులైన యేడేల సుబ్బారావు, గెమ్మిలి శోభన్, యేడేల ఈశ్వరి, కొర్రా కమలను అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారు. కానీ, ఇందులో రాజకీయ కోణమే ప్రధానమైనదని ఏజెన్సీవాసులు చెపుతున్నారు. రాజకీయంగా కిడారిని అడ్డు తొలగించుకోడానికే ఈ ప్రయత్నమని అంటున్నారు. మావోయిస్ట్‌లకు సహకరించింది ఈ నలుగురే కావచ్చు. కానీ ఈ నలుగురిని నడిపించిన వారు ఎవరన్నది పోలీసులు నిగ్గుతేల్చాల్సి ఉందని అంటున్నారు. సిట్ దర్యాప్తులో ఈ విషయం బయటపడిందని చెపుతున్నారు. అయితే, సదరు వ్యక్తి అధికార పార్టీకి చెందినవారైనందువలన పార్టీ పరువు ప్రతిష్ఠలు దెబ్బతింటాయని రాజకీయ కోణాన్ని పక్కన పెట్టారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇప్పటికి రాజకీయ కోణాన్ని పక్కన పెట్టేసినట్టేనని స్పష్టమవుతోంది.
ఇదిలా ఉండగా సుమారు 50 మంది మావోయిస్ట్‌లు కోరాపుట్ నుంచి కాలి నడకన బయల్దేరి లివిటిపుట్టు వరకూ వచ్చారంటే, సామాన్యమైన విషయం కాదు. సెల్ ఫోన్‌ల ద్వారానే సమాచారం నడుపుకొంటూ వీరు లివిటిపుట్టు చేరుకున్నారు. ఇందులో పోలీసు నిఘా వైఫల్యం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయమై ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరు సమావేశంలో పోలీసు అధికారులు వెల్లడించలేదు.
లివిటిపుట్టు ఘటన సామాన్యమైనది కాదు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను పట్టపగలు 50 మంది మావోయిస్ట్‌లు హతమార్చారు. అది కూడా సామాన్య జనం చూస్తుండగానే..ఇందులో వాస్తవాను పూర్తిస్థాయిలో బయటపెట్టాల్సిన బాధ్యత విచారణ అధికారులపై ఉంది. ఈ ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందన్న అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా దర్యాప్తు జరిపి, రాజకీయ వ్యక్తుల జోక్యం ఉందా? లేదా? అన్న స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు, నిఘా వైఫల్యంపై పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటి వరకూ ఎవ్వరిపై చర్యలు తీసుకోపోవడం పట్ల విమర్శలకు తావిచ్చినట్టవుతుంది.