విశాఖపట్నం

విలక్షణ వ్యక్తిత్వం మూర్తి సొంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 14: విలక్షణ వ్యక్తిత్వం, జీవితం దివంగత ఎంవీవీఎస్ మూర్తి సొంతమని పలువురు అభిప్రాయపడ్డారు. గీతం విద్యా సంస్థల చైర్మన్, ఎమ్మెల్సీ మూర్తి సంస్మరణ సభ వాల్తేరు క్లబ్‌లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా మూర్తి ఉన్నత శిఖరాలు అధిరోహించారని, అదే క్రమశిక్షణను అలవరచుకోవాలని ఆయన అందరికీ సూచించేవారన్నారు. ఎన్టీఆర్ సతీమణి బసవరామతారకం పేరిట కేన్సర్ ఆసుపత్రి నిర్మాణం, నిర్వహణ నాటి నుంచి మూర్తితో కలిసి పనిచేశామన్నారు. టీడీపీలో కీలక పాత్ర పోషించిన మూర్తి ఉత్తరాంధ్రలో పార్టీకి పెద్దదిక్కుగా ఉండేవారన్నారు. మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ టీడీపీలో తన రాజకీయ జీవితం ఆరంభానికి మూర్తి పునాదులు వేశారన్నారు. ఆయన అకాలమరణం ఆయన కుటుంబానికే కాదు పార్టీకి తీరని లోటన్నారు. ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా తన పనిచేసుకుపోయే వ్యక్తిత్వం ఆయన సొంతమన్నారు. వ్యాపారం, పార్టీ పరంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చిరునవ్వుతో పలుకరించేవారన్నారు. సినీనటుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ దివంగత మూర్తి నాన్నగారితో ఎంతో అనుబంధంతో మెలిగేవారని, ఆ స్నేహ బంధమే తమను బంధువులుగా మార్చిందన్నారు. పార్టీలో కీలక వ్యక్తుల్లో ఒకరైన మూర్తి మన మధ్య లేరన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ అన్నీ సవ్యంగా జరిగితే ఇదే రోజు మూర్తి విదేశీ పర్యటన విజయవంతంగా ముగించుకుని వచ్చి అభినందన సభ జరుపుకునే వారన్నారు. కానీ విధి ఈ కార్యక్రమాన్ని సంస్మరణ సభగా మార్చిందన్నారు. మూర్తి వెలిగించిన ‘గీతం యూనివర్శిటీ’ జ్ఞానజ్యోతి నిరంతరం వెలుగులు ప్రసరించాలంటే కుటుంబీకులు సమర్ధవంతంగా దాన్ని నిర్వహించాలని సూచించారు. గీతం ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణారావు మాట్లాడుతూ గీతం యూనివర్శిటీతో మా ఇద్దరి మధ్య బంధం మరింత పెరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థను సమర్ధవంతంగా నడుపుతూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారన్నారు. అంతకు ముందు మూర్తి చిత్రపటం వద్ద కేంద్ర మాజీ మంత్రులు అశోక్ గజపతిరాజు, కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురంధ్రీశ్వరి, మంత్రి పితాని సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేష్‌బాబు, వెలగపూడి రామకృష్ణబాబు, ఏయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె నిరంజన్, మూర్తి అభిమానులు భోగినేని సుబ్బారావు చౌదరి, తదితరులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు రామారావు, లక్ష్మణరావు, భారతి, మనుమలు శ్రీ భరత్, భరద్వాజ్ తదితరులను పరామర్శించారు.