విశాఖపట్నం

పండుగ దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 14: పండుగలు, సెలవులు, పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే ప్రయాణీకులకు గుండెదడ మొదవవుతోంది. ప్రయాణీకుల రద్దీని సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వ రంగ ఆర్టీసీతో పాటు ప్రైవేటు ఆపరేట్లు పోటీపడుతున్నారు. ప్రస్తుతం దసరా పండుగ సందర్భంగా వరుస సెలవులు రావడంతో ప్రయాణీకుల రద్దీ పెరిగింది. విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల సంఖ్య వందలు దాటి వేలకు చేరడంతో ఇదే అదనుగా ఆర్టీసీ సహా ప్రైవేటు ఆపరేటర్లు తెరతీశారు. దసరాకు సొంతూర్లకు వెళ్లి తిరిగి వచ్చే వరకూ అంటే ఈ నెల 13 నుంచి రానున్న 20వ తేదీ వరకూ అన్ని రూట్లలో టికెట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. సాధారణంగా పండుగ ప్రయాణాల కోసం నెల రోజుల ముందు నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకుంటారు. అప్పటికే అన్ని ప్రైవేటు, ఆర్టీసీ సర్వీసుల్లోను టికెట్లు అందుబాటులో లేవనే సమాచారం వస్తోంది. రద్దీ తేదీల్లో బస్ సర్వీసులు లేకుండా చేసి, ప్రస్తుతం వాటినే ప్రత్యేక సర్వీసులుగా నడిపే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణ రోజుల్లో విశాఖ నుంచి విజయవాడకు గరుడ సర్వీసుల్లో రూ.600 నుంచి రూ.800 టికెట్ ధరగా ఉండేది. ప్రస్తుతం ఏసీ సర్వీసుల్లో (ఆర్టీసీ) రూ.1000 నుంచి 1200 వసూలు చేస్తుండగా, ప్రైవేటు సర్వీసుల్లో రూ.1500 నుంచి 1700 వసూలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్‌కు సాధారణ రోజుల్లో రూ.1500 ఉండగా, ప్రస్తుతం రూ.2500 వసూలు చేస్తున్నారు. ఇక ప్రైవేటు సర్వీసుల్లో హైదరాబాద్‌కు టికెట్ల ధరలు రూ.3000 దాటేసింది. సాధారణ సర్వీసుల్లో తాము అధిక ధరలు వసూలు చేయట్లేదని, పండుగ రద్దీ సందర్భంగా నడిపే ప్రత్యేక సర్వీసుల్లోనే 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ఇక ప్రైవేటు ఆపరేటర్ల విషయానికొస్తే పండుగ రద్దీ నేపథ్యంలో నెల రోజుల కిందటే టికెట్ల జారీ నిలిపివేశారు. ప్రస్తుతం ప్రైవేటు బస్సుల్లో టికెట్ ధరలు ఆన్ డిమాండ్ పేరిట పెంచుతున్నారు.
ఇదిలా ఉండగా అత్యవసరంగా బయలుదేరే సంపన్న వర్గాలు కూడా రవాణా ఛార్జీల మోతను భరిస్తున్నాయి. విశాఖ నుంచి పలు విమానయాన సంస్థలు నడిపే సర్వీసుల్లో ఛార్జీల మోత మోగుతోంది. సాధారణ రోజుల్లో విశాఖ నుంచి హైదరాబాద్‌కు రూ.2000 నుంచి రూ.3000 ఉండే టికెట్ ధరలు ఒక్కసారిగా రూ.5000 నుంచి రూ.7,500కు పెరిగాయి. బెంగళూరుకు సాధారణ ఛార్జీ రూ.3,000 నుంచి రూ.3,500 కాగా దసరా ప్రత్యేకం రూ.5,500 నుంచి రూ.7,000, ఢిల్లీకి సాధారణ రోజుల్లో రూ.5000 ఉండగా, ప్రస్తుతం రూ.10వేలకు చేరుకుంది.
ఇదిలా ఉండగా దసరా సందర్భంగా ఆర్టీసీ విశాఖ నుంచి కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, రాజోలు, భీమవరం, నర్సాపురం, విజయవాడ, గుంటూరుకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

రోగాలతో చస్తున్నా.. సమ్మె విరమించరా?
* పట్టు..విడుపు లేని ప్రభుత్వం..ఉద్యోగులు * మురికి కూపాల్లా మారుతున్న వీధులు * ప్రజల్లో పెరుగుతున్న నిరసన

విశాఖపట్నం, అక్టోబర్ 14: స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్‌తో నగర ప్రజలు మంచం ఎక్కారు. కొంత మంది చనిపోతున్నారు. అయినా, జీవీఎంసీ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులకు ఏమాత్రం పట్టడం లేదు. తమ డిమాండ్ల సాధన కోసం పారిశుద్ధ్య కార్మికులు 11 రోజుల నుంచి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో నగరంలో చెత్త పేరుకుపోతోంది. డస్ట్‌బిన్స్‌లోని చెత్తను కుక్కలు పందులు చిందరవందర చేయడంతో ఆ చెత్తంతా రోడ్డుమీద పడుతోంది. దీంతో నగరంలోని ఏ రోడ్డు చూసినా మురికి కూపాలతో కుళ్లు కంపుకొడుతున్నాయి. మురికి కాలువలను శుభ్రం చేయకపోవడం వలన దోమలు పెరిగిపోతున్నాయి. దీంతో నగరంలో వైరల్ ఫీవర్స్ పెరిగిపోయాయి. అలాగే, నగరంలో డెంగ్యూ కేసులు రోజుకు మూడు నుంచి ఐదు నమోదవుతున్నాయి. గడచిన వారం రోజుల్లో స్వైన్ ఫ్లూ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం నగరంలో ఎనిమిది స్వైన్ ఫ్లూ కేసులు ఉన్నాయి. మరో పది మందికి స్వైన్ ఫ్లూ సోకింది. వీరికి ఈ వ్యాధి నిర్థారణ కావల్సి ఉంది. వీటన్నింటికీ కారణం దోమలు. దోమలపై దండయాత్ర, స్వచ్ఛ తే సేవ అంటూ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోంది. పారిశుద్ధ్య సమస్య రోజు రోజుకూ పెరిగిపోతున్నా పట్టించుకోవడం లేదు. వ్యాధుల బారిన పడి విశాఖలో జనం చస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేకపోవడం శోచనీయం. ఇక పారిశుద్ధ్య కార్మికులు కూడా నగరంలోని పరిస్థితిని అర్థం చేసుకుని సమ్మె విరమించి ఉంటే బాగుండేది. వారు కూడా పట్టుదలకు పోయి, నగరాన్ని గబ్బు పట్టిస్తున్నారు. ఇప్పటికే సమ్మె విరమణకు సంబంధించి అధికారులు, కార్మిక సంఘ నేతల మధ్య చర్చలు జరిగినా, అవి ఫలప్రదం కాలేదు. నగరంలో పరిస్థితి చేదాటుతున్నా, పారిశుద్ధ్య సమస్యను ఎదుర్కొనేందుకు కలెక్టర్ కానీ, జీవీఎంసీ కమిషనర్ కానీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. వీవీఐపీలు ప్రయాణించే మార్గాలు, అధికారుల బంగ్లాల వద్ద పారిశుద్ధ్యం బాగుంటే, నగరమంతా బాగుందని భావిస్తున్నారో ఏమో? అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే, నగర ప్రజల బాధలేంటో అర్థమవుతాయి. ఇప్పటికైనా ప్రభుత్వమైనా, పారిశుద్ధ్య కార్మికులైనా దిగిరాకుంటే, నగరంలోని పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారే ప్రమాదం ఉంది.

పారిశుద్ధ్య కార్మికు చర్చలు విఫలం

విశాఖపట్నం, అక్టోబర్ 14: నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్మికులను విరమించాలని జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ విజ్ఞప్తి చేయగా, తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని కార్మి సంఘ నాయకులు స్పష్టం చేశారు. దీంతో కమిషనర్‌కు, కార్మిక సంఘాల నాయకులకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. జీవీఎంసీలో 279 జీఓ అమలులో లేదని, ఉద్యోగ భద్రతకు ఢోకా లేదని కమిషనర్ కార్మిక సంఘ నాయకులకు చెప్పారు. 279 జీఓ అమలులో ఉన్నా, టెండరు పిలిచిన మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరవుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐటీయూ ప్రతినిధులు వెంకటరెడ్డి, సుబ్బారావు మాట్లాడుతూ జేఏసీ నిర్ణయానుసారం తాము సమ్మెకే కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అమరావతిలో సోమవారం ఉదయం చర్చలు జరగనున్నాయని, దానికి తాను హాజరవుతున్నానని చెప్పారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె కొనసాగిస్తామని వెల్లడించారు.