విశాఖ

దుర్గమ్మ ఆలయంలో సరస్వతీ దేవి పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి టౌన్, అక్టోబర్ 14: శరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా స్థానిక సత్యనారాయణపురం కళ్యాణగిరి కట్టపై కలువైయున్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆదివారం కనకదుర్గమ్మవారు సరస్వతీదేవి ఆలంకరణలో భక్తులకు దర్సినమిచ్చారు. ఈ సందర్బంగా భోగాపురపు సూర్యనారాయణ చార్యులు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి ధర్మాచార్యులు అధ్వర్యంలో విద్యార్ధులకు సరస్వతీదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మూలా నక్షత్రం సందర్బంగా అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలాగే విద్యార్ధులకు నోట్‌బుక్సు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు బోయిన నాగేశ్వరరావు, ఆలయచైర్మన్ మేడిశెట్టి రామ సత్యనారాయ, అన్నదానం ట్రస్టుచైర్మన్ బోయిన రమణాజీ, ఆలయం కమిటీ సభ్యులు యడ్ల త్రినాథరావు, కోరుకొండ సాంబశివరావుఅధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

డ్రైనేజీ కాలువలు లేక మరుగునీరు సమస్య
*దోమలు వృద్దితో ప్రజలు ఇబ్బందులు

అనకాపల్లి టౌన్, అక్టోబర్ 14: పట్టణానికి ఆమడ దూరంలో ఉన్న కొత్తూరు పంచాయితీ పరిధిలో ఉన్న దేవీనగర్ అభివృద్దిలో మాత్రం వెనుకబడి ఉందని అక్కడి పరిస్థితి చూసిన వారికి ఇట్టే అర్ధమవుతుంది.ప్రధానంగా సత్యనారాయణపురం కనక దుర్గమ్మకొండకు వెళ్ళే ప్రధాన మార్గంగా ఉన్న దేవీనగర్ రోడ్డుశిధిలావ్యవస్థకు చేరుకోవడంతో పాటు డ్రైనేజి కాలువలు లేకపోవడంతో ఇండ్లల్లో వాడుకనీరు ఎక్కడకక్కడ రోడ్లుపై నిలిచిపోయి దోమలు వృద్ది చెందుతున్నాయని అక్కడ ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. దుర్గమ్మగుడికి దైవ దర్శనానికి వెళ్ళే భక్తులు ముగురునీటిలో నడుచుకొని వెళ్ళడానికి ఇష్టపడక అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో ప్రజలు అందోళన చెందుతున్న తరుణంలో మరుగునీరు ఎక్కడకక్కడ నిల్వ ఉండిపోవడంతో దోమలు వృద్దిచెంది ప్రజలు ప్రాణాలుతో ఆడుకుంటున్నాయని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.పంచాయితీ అధికారులు, పారిశుద్ద్య కార్మికులు ఇక్కడి సమస్యలపై నిర్లక్ష్యంగా ఉండడంతో తాగునీటి కోలాయి వద్ద వ్యర్ధాలు, మరుగునీటిలో నిండి ఉండడంతో ఆ ప్రాంత ప్రజలు కోలాయి వద్ద తాగునీరు పట్టుకోవడానికి ఇష్టపడటలేదని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై పంచాయితీ అధికారులు స్పందించి ఇక్కడి సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

గిరిజనుల భూ సమస్యల పరిష్కారానికి కృషి
మాడుగుల, అక్టోబర్ 14: మండలంలోని గిరిజనులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరింపచేసేందుకు తమ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని సి.పి.ఐ. మండల కార్యదర్శి సీత బెన్నంనాయుడు చెప్పారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 2005వ సంవత్సరంలో ఇందిరఫ్రభ పథకం కింద మండలంలోని జె.డి.పేట, గవరవరం, కొండపాడు, పొత్తూరు గ్రామాలలో గిరిజనులకు 150 ఎకరాల బంజరు భూములు కేటాయించారని అన్నారు. అయితే గిరిజనులకు కేటాయించిన భూములు వారికి అప్పగించకపోవడంతో ఎన్నో సంవత్సరాలుగా వీటిని సాగు చేసుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. ఈ విషయమై తమ పార్టీ అనేకసార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా రెవిన్యూ అధికారులతో చర్చించినట్టు ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ భూములను సర్వే చేసేందుకు మాడుగుల తాహశీల్ధార్ ఆదేశించారని ఆయన చెప్పారు.