విశాఖ

కాంగ్రెస్‌తోనే ప్రత్యేక హోదా సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, అక్టోబర్ 14: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి , డీసీసీ అధ్యక్షుడు పసుపులేటి బాలరాజు పేర్కొన్నారు. ఆదివారం ఇంటింటా కాంగ్రెస్ పార్టీ ప్రచార యాత్రను స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని బీజేపీ విస్మరించిందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పాలన అవినీతి మయంగా మారిందని విమర్శించారు. దేశంలో , రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి ఆదరణ పెరుగుతుందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని రాజీవ్‌గాంధీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు , భవిష్యత్ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వెళ్ళి ప్రజలకు వివరించాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. అనంతరం ఇంటింటా కాంగ్రెస్ కార్యక్రమాన్ని మున్సిపాలిటీ పరిధిలోని పెదబొడ్డేపల్లిలో నిర్వహించారు. ఈసందర్భంగా నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త రుత్తల శ్రీరామ్మూర్తి ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ ప్రచురించిన కరపత్రాలను మహిళలకు అందజేసారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చాలని ఆయన ఈసందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈకార్యక్రమంలో మూడు మండలాల పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

చేపల చెరువులకు అనుమతులు ఇవ్వాలి
దేవరాపల్లి, అక్టోబరు 14: ప్రభుత్వ నిబంధనలకు లోబడి అధికారులు చేపల చెరువులకు అనుమతులు ఇవ్వాలని, అడ్డగోలుగా అనుమతులు ఇస్తే రైతుల నుండి ప్రతిఘటన తప్పదని సిపియం పేర్కొంది. ఆదివారం రైవాడ జలాశయం క్రింద ఉన్న బోయిలకింతాడ కొత్తూరు దగ్గరలో చేపల పెంపకం కొరకు తయారు చేసిన చెరువులను సిపియం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి.వెంకన్న, కెవిపిఎస్ జిల్లా నాయకులు కాటపల్లి అప్పారావు, కె.సన్యాసినాయుడు కలిసి పరిశీలన చేసారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ మండలంలో విచ్చల విడిగా ఎటువంటి అనుమతులు లేకుండా చేపల చెరువులు తవ్వకాలు జరుగుతున్నాయని, దీనిపై సిపియం ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించి చేపల చెరువులకు భూములు ఇచ్చిన రైతులతోను, చేపల పెంపకందార్లు సమావేశం ఏర్పాటు చేసి 15 రోజుల్లోగా అనుమతులు పొందకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేయటం జరిగిందని, దీంతో సంబంధిత అధికారులు దగ్గరకు చేపల పెంపకందార్లు పరుగులు తీస్తున్నారని, అనుమతులు ఇచ్చే అధికారులు ప్రభుత్వం ఇచ్చే జిఓ నెంబరు 7,15,56కు లోబడి అనుమతులు ఇవ్వాలని లేనిచో రైతుల నుండి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. మండంలోని ఏ ఒక్క చెరువుకు అనుమతి పొందలేదని, రెండు సంవత్సరాలు పాటు మత్య్యశాఖ అధికారులు చేపల చెరువుల యజమానుల నుండి లక్షలాదిరూపాయలు ముడుపులు తీసుకుని వదలి పెట్టారని అన్నారు. ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి రైతుల పంటపొలాలకు అందవలసిన సాగునీరు అందడం లేదన్నారు. వెంటనే చేపల చెరువులు మూసివేయాలని, అనుమతులు ఇచ్చిన అధికారులు నిబంధనలకు లోబడి అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేసారు.